Trending: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్‌‌చల్.. ఏకంగా పోలీసులపైకి..

by Shiva |   ( Updated:2024-09-26 06:56:54.0  )
Trending: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబు హల్‌‌చల్.. ఏకంగా పోలీసులపైకి..
X

దిశ, వెబ్‌డెస్క్: బహిరంగ మద్యపానం చేయకూడదని, తాగి వాహనాలు నడపకూడదనే ఆంక్షలు ఎప్పటి నుంచో రాష్ట్ర వ్యాప్తంగా అమల్లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా నగరంలోని చంపాపేట్ (Champapet) ప్రధాన రహదారిలో పోలీసులు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ (Drunk and Drive)ను నిర్వహించారు. అయితే, ఓ వ్యక్తి ఆటోలో వస్తుండగా అతడిని ఆపి చెక్ చేసిన పోలీసులు ఫుల్లుగా మద్యం తాగినట్లుగా నిర్ధారించారు. దీంతో ఆటోను సీజ్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) ప్రయత్నించగా ఏకంగా వారిపైకి ఆటోను ఎక్కించేందుకు యత్నించాడు. అదేవిధంగా అడ్డుకున్న వారిపై పచ్చి బూతులు మాట్లాడుతూ విరుచుకుపడ్డాడు. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆటోను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed