ఇది కదా అసలైన డిజిటల్ భారత్.. 7 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్‌ డెలివరీ.. వైరల్‌ అవుతోన్న కస్టమర్‌ పోస్ట్‌

by Kavitha |
ఇది కదా అసలైన డిజిటల్ భారత్.. 7 నిమిషాల్లోనే ల్యాప్‌టాప్‌ డెలివరీ.. వైరల్‌ అవుతోన్న కస్టమర్‌ పోస్ట్‌
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అప్పట్లో మనం ఏదైన వస్తువును కొనాలంటే డైరక్ట్‌గా వెళ్లి తీసుకునే వాళ్లము. కానీ, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుతం చాలామంది ఆన్‌లైన్‌ షాపింగ్‌కే ఎక్కువ ఫ్రిఫర్ చేస్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొనే ఆన్‌లైన్ కంపెనీలు కూడా దాదాపు వీలైనంత త్వరగా డెలివరీ చేయడానికి దోహదపడుతున్నాయి. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ వంటి కంపెనీలు మాత్రం ఆర్డర్ పెట్టిన ఒక్కరోజులోనే డెలివరి చేసేస్తున్నాయి. అదే బ్లింక్ ఇట్, జెప్టో వంటి కంపెనీలు నిత్యవసర వస్తువులను 10 నిమిషాల్లో డెలివరీ చేస్తున్నాయి. ఇలాంటి క్విక్‌ కామర్స్‌కు ప్రస్తుతం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ క్విక్‌ కామర్స్‌ రంగంలోకి ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ కూడా వచ్చి చేరింది. ఆర్డర్‌ చేసిన క్షణాల్లోనే ఎలాంటి వస్తువునైనా సరే డెలివరీ చేస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ పేరుతో ఈ సరికొత్త సేవలను పరిచయం చేశారు. దీంతో కేవలం నిత్యవసరాలే కాకుండా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ను సైతం క్షణాల్లో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి రాగా.. ఓ కస్టమర్‌ సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్‌ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ మినిట్స్‌ ద్వారా ల్యాప్‌ట్యాప్‌ బుక్‌ చేసుకోగా కేవలం 7 నిమిషాల్లోనే డెలివరీ కావడం విశేషం. అలా బుక్ చేసుకున్నప్పటి నుంచి డెలివరీ అయ్యే వరకు పట్టిన సమయం 13 నిముషాలు మాత్రమే. వివరాల్లోకి వెళితే..

సన్నీ గుప్తా అనే వ్యక్తి ఫ్లిప్‌కార్ట్‌లో ల్యాప్‌టాప్‌ను బుక్‌ చేసుకున్నాడు. ప్రిడేటర్‌ ల్యాప్‌టాప్‌ను బుక్‌ చేసుకోగా కేవలం 7 నిమిషాల్లోనే ఇంటికి డెలివరీ అయ్యింది. ఈ విషయాలను అన్నింటినీ వివరిస్తూ ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్ చేశాడు. డెలివరీ బాయ్‌ ల్యాప్‌టాప్‌ను తీసుకొస్తున్న వీడియోను సైతం పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన నెటిజన్లు ఇది కదా అసలైన డిజిటల్ భారత్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to Sunny R Gupta X account)

Advertisement

Next Story