- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ నాగు పాముతో చేసిన పకోడీలకు ఫుల్ డిమాండ్.. షాక్‌లో నెటిజన్లు (వీడియో)
దిశ, ఫీచర్స్: అత్యంత విషపూరితమైన నాగుపామును చూస్తే జనాలు భయాందోళనలకు గురవుతారు. దాని పేరు విన్నా సరే భయంతో వణికిపోతుంటారు. కొందరైతే నాగు పాముకు సంబంధించిన వీడియోలు చూసిన కానీ అదో రకమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంటారు. మరీ ముఖ్యంగా పాముల ఫొటోలు, వీడియోలు చూసి కొందరు అన్నం కూడా తినడానికి ఇష్టపడరు. అలాంటిది ఓ చోట ఏకంగా నాగుపాములతో చేసిన పకోడీలు, మోమొస్ తినడానికి జనాలు ఆసక్తి చూపిస్తారు.
ఇదంతా కంటెంట్ క్రియేటర్ ఆకాష్ చౌదరి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. ఇండోనేషియాలోని ఓ ఫుడ్ స్టాల్‌లో కోబ్రా పకోడీలు, మోమొస్ తినడానికి ఎంతో ఉత్సాహంగా జనాలు అక్కడికి వచ్చిన వారిని కూడా ఆకాష్ చూపించాడు. అయితే కోబ్రా రక్తాన్ని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని కూడా అక్కడికి వచ్చి తాగుతారట. ఓ పెద్ద బోన్‌లో ఉన్న చాలా పాములను కూడా వీడియోలో చూడవచ్చు.
అందులో మనం దేనిని ఎంపిక చేసుకుంటే దానితో పకోడీ చేసి ఇస్తాడు. ఆ ఫుడ్ స్టాల్ ఓనర్‌ను పాము పకోడీ ధర ఎంతని అడగ్గా.. ఏకంగా రూ. 2 లక్షలు ఉంటుందని తెలపడంతో ఆకాష్ ఆశ్చర్యపోయి ఇలాంటి స్టాల్ ఎక్కడా చూడలేదని ఆన్సర్ ఇచ్చాడు. అంటే.. నాగుపాము పకోడీలకు ఇండియన్ కరెన్సీలో రూ. 1000 అని తెలుస్తోంది. అక్కడ నాగుపాముతో చేసిన ఐటమ్స్‌కు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు సమాచారం. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
(Video Link Credits to kaash chaudhary Instagram Channel)