వధువుకు కట్నం ఇచ్చే ఆచారం.. డబ్బులు లేక ఒంటరవుతున్న యువకులు

by sudharani |   ( Updated:2023-03-05 15:47:13.0  )
వధువుకు కట్నం ఇచ్చే ఆచారం.. డబ్బులు లేక ఒంటరవుతున్న యువకులు
X

దిశ, వెబ్‌డెస్క్: కట్నాలు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకునే పద్ధతి మన సమాజంలో అనాతి కాలం నుంచి వస్తున్న ఆచారం. వధువుల నుంచి కోరిన కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడమే కాకుండా.. అదనపు కట్నాలు కోసం వేధింపులు దిగుతుంటారు. అయితే వీటికి విరుద్ధంగా వధువుకి కట్నం ఇవ్వడం ఆచారంగా ఉంది ఓ దేశంలో. దీంతో వధువు కోరినంత కట్నం ఇవ్వలేక యువకులు ఏకంగా పెళ్లి చేసుకునేందుకు కూడా భయపడుతున్నారు. ఈ విచిత్ర ఆచారం చైనాలో ఉంది. ఇప్పటికే జనాభా రేటు తక్కువగా ఉండటం.. దీనికి తోడు పెళ్లిళ్లు తగ్గిపోవడంతో చైనా ప్రభుత్వానికి వధువు కట్నం ఆచారం పెను సవాల్ విసురుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

తూర్పు చైనాలోన జియాంగ్జి ప్రావిన్స్‌లో వధువు కట్నం తీసుకునే ఆచారం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ వధువును పెళ్లి చేసుకోవాలంటే వారు కోరిన కార్లు, బంగ్లాలు, డబ్బులు ఇవ్వాలి. వీటిని ఒప్పుకుని కొంత మంది మగవారు వారు సంపాదించినదంతా వధువులకే ఇచ్చి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ, కొంత మంది మాత్రం వధువు అడిగే కట్నాలకు బెంబేలెత్తిపోయి పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. ఆ క్రమంలో చాలా నగరాల్లో 25 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్న సింగిల్ యువకులు, యువతుల సంఖ్య పెరుగుతుంది. దీంతో చైనా ప్రభుత్వం ఈ వధువు కట్నం ఆచారానికి వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. ఈ మేరకు ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. ఫెడెరికో గిలియాని అనే రైటరర్ ఇన్సైడ్ ఓవర్‌లో రాసుకొచ్చారు. కాగా.. దీనికి సంబంధించిన న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి :

పామునే డ్రెస్‌గా వాడేస్తుంది..

Advertisement

Next Story