- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రోజూ స్కూల్‌కు లేట్‌గా వస్తోన్న స్టూడెంట్.. కారణం తెలిసి ఖంగుతిన్న టీచర్(వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగం చేసేవాళ్లమని చాలామంది పెద్దవాళ్లు బాధపడుతూ ఉంటారు. కాగా పలువురు తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో అస్సలు ఇలా అవ్వకూడదని ఆలోచిస్తారు. అందుకోసం తాము అప్పు చేసైనా, ల్యాండ్ అమ్మైనా తమ పిల్లల్ని మంచి మంచి పాఠశాలో, కళాశాలలో చదివిస్తున్నారు. అయితే ఎంత కష్టపడి నాణ్యమైన స్టడీ కోసం మనీ పెట్టడమే కాకుండా చదువు విషయంలో పిల్లల ఫర్ఫామెన్స్‌పై పేరెంట్స్ ఓ కన్నేసి ఉంచాలి. ఇకపోతే కొంతమంది పిల్లలు మార్నింగ్ లేవగానే ఏం చక్కా పాఠశాలకు వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. కానీ కొంతమంది పిల్లలకు స్కూలు అంటేనే ఏడుపోస్తుంటుంది. ప్రస్తుతం ఓ స్కూల్‌కు వెళ్లడం ఇష్టం లేని ఓ పిల్లాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాఠశాలకు ఆలస్యంగా ఎందుకొచ్చావని టీచర్ ప్రశ్నించగా.. ‘మా అమ్మ టైంకు నిద్రలేస్తుంది.. కానీ నన్ను లేపడం లేదు టీచర్’. అని చెబుతాడు. అప్పుడు టీచర్.. స్కూల్ 7:30కు అని చెప్పు, 8:30 కు బడిలో ఉంటావ్ అని చెబుతుంది. అప్పుడు పిల్లవాడు ‘నాకు తెలియదు’ అంటూ బోరున ఏడ్వడం మొదలుపెడుతాడు. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఈ బుడ్డోడి వీడియోకు ప్రస్తుతం 2 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.