- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వధువు ఏడుపు.. వరుడు కోసం కాదు.. నెట్టింట లక్షలాది మంది ఓదార్పు.. అసలేం జరిగిందంటే..?
దిశ, ఫీచర్స్ : పెళ్లిళ్లకు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే, తాజాగా ఓ ఆసక్తికరమైన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. పెళ్లి ముహూర్తం ముగిసి వధువును అప్పగించిన తర్వాత జరిగిన దృశ్యం చూసి అందరూ షాక్ అయ్యారు. పెళ్లికూతురికి వీడ్కోలు పలుకుతూ తల్లిదండ్రులు, అన్నదమ్ములు కౌగిలించుకుని ఇంటికి బయల్దేరుతారు. ఉద్వేగానికి లోనైనప్పుడు, వారు తమ ప్రియమైన వారిని గట్టిగా పట్టుకొని మరింత ఏడుస్తారు. అప్పగింతల సమయంలో ఇక్కడ పెళ్లి కూతురు కుక్కను పట్టుకుని ఏడుస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
వధువు పెళ్లి తర్వాత తన అత్తమామల వద్దకు వెళుతున్నప్పుడు ఏడుపు మొదలు పెట్టింది. పెళ్లి కారులో ఆమె కుక్కను ఒడిలో పెట్టుకుని ఏడ్చింది. ఈ తతంగమంతా స్థానికులు రికార్డ్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తన కుక్కతో ఉన్న ఈ అమ్మాయి బంధాన్ని చూసి మెచ్చుకుంటున్నారు. జంతు ప్రేమికులు మాత్రమే ఈ బాధను అర్థం చేసుకోగలరని సోషల్ మీడియా నెటిజెన్ రాసుకొచ్చారు. కొందరైతే కుక్కను కూడా తనతో తీసుకెళ్లవచ్చు కదా అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియోను ఇప్పటికే ఎనిమిది లక్షల మందికి పైగా లైక్ చేసారు. 2.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది వీక్షించారు. ఈ వీడియోపై వేలాది మంది వారి స్పందనను తెలియజేస్తున్నారు.