ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. దాని ఎత్తు, వెడల్పు చూశారంటే దడుచుకోవాల్సిందే..

by Sumithra |
ప్రపంచ రికార్డును సృష్టించిన ఎద్దు.. దాని ఎత్తు, వెడల్పు చూశారంటే దడుచుకోవాల్సిందే..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ రికార్డులను కేవలం మనుషులే కాకుండా కొన్నిసార్లు జంతువులు కూడా అందుకుంటున్నాయి. మొన్నటికి మొన్న ఓ పిల్లి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బిరుదును అందుకుంటే ఇప్పు ఓ ఎద్దు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నిజానికి, 6 ఏళ్ల హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా చెబుతున్నారు. అమెరికాలోని ఒరెగాన్‌లోని ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే రోమియో చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. దాన్ని చూడగానే ప్రజలందరూ ఒక్కసారిగా భయపడిపోతారు. అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటుందని చెబుతున్నారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అందులో '1.94 మీటర్ల (6 అడుగుల 4.5 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దు రోమియోని చూడవచ్చు. రోమియో తన యజమాని మిస్టీ మూర్‌తో కలిసి వెల్‌కమ్ హోమ్ యానిమల్ శాంక్చురీలో నివసించే 6 ఏళ్ల హోల్‌స్టెయిన్ ఎద్దు. ఈ నల్లటి ఎద్దుకు ఓ మహిళ అరటిపండు తినిపిస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం రోమియో ఆహారాన్ని ఎంతగానో ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఆపిల్, అరటిపండ్లు. అతను ప్రతిరోజూ 100 పౌండ్ల (45 కిలోగ్రాముల) ఎండుగడ్డి, అలాగే ధాన్యాలు, ఇతర ఆహారాన్ని కూడా తింటుంది. దాని భారీ పరిమాణం కారణంగా దానికి సౌకర్యవంతమైన రవాణా, మంచి ఆశ్రయం కూడా అవసరం. రోమియోకు కేవలం 10 రోజుల వయస్సు ఉన్నప్పుడు దాన్ని వధించడానికి కబేళాకు తీసుకువెళ్లారని, కానీ అది చనిపోకుండా కాపాడానని మిస్తీ చెప్పారు. దీని తర్వాత, ఆమె దాన్ని తన ఇంటికి తీసుకువెళ్ళి స్వయంగా పెంచడం ప్రారంభించింది.

అయితే రోమియోను పెంచడంలో మిస్తీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ ఎద్దు చాలా పొడవుగా, వెడల్పుగా ఉంది కాబట్టి దాని ఆహారం కూడా ఎక్కువగా ఉందని స్పష్టంగా తెలుస్తుంది. అలాంటప్పుడు మిస్తీకి ఆ ఎద్దు ఆహారం కోసం డబ్బు సేకరించడం చాలా కష్టం. దాన్ని పోషించడానికి నిధులు సేకరించవలసి వచ్చింది. ఫలితంగా ఈ ఎద్దు తన పేరును ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందేలా చేసింది.

Advertisement

Next Story

Most Viewed