తిరుమలలో స్టార్ హీరో ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్.. వైరల్ అవుతున్న ఫొటో

by karthikeya |
తిరుమలలో స్టార్ హీరో ఇచ్చిన డిక్లరేషన్ ఫామ్.. వైరల్ అవుతున్న ఫొటో
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల లడ్డూ కల్తీ వివాదం ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ తిరుమల పర్యటనకు సిద్ధం కాగా.. ఆయన డిక్లరేషన్ ఇవ్వాలంటూ హిందూ సంఘాలు, కూటమి ప్రభుత్వ నాయకులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. దీంతో జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండా ఏకంగా పర్యటననే రద్దు చేసుకున్నారు. అయితే జగన్ పర్యటన రద్దుపై కూడా వివాదం రేగింది. అన్యమతస్థులైన అబ్దుల కలాం లాంటి వారు కూడా శ్రీవారిపై తనకు నమ్మకం ఉందని చెబుతూ డిక్లరేషన్ ఇచ్చారని, కానీ జగన్ మాత్రం ఎందుకు ఇవ్వడానికి వెనకాడుతున్నారని అనేకమంది ప్రశ్నించారు.

కాగా.. ఇలాంటి టైంలో బాలీవుడ్ స్టార్ హీరో కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్‌ తిరుమలను దర్శించుకున్న సమయంలో సమర్పించిన డిక్లరేషన్ ఫామ్ వైరల్ అవుతోంది. ఈ ఫామ్‌లో షారూఖ్ ఖాన్, తాను ముస్లింనని, కానీ తనకి శ్రీ వేంకటేశ్వరస్వామిపై కూడా నమ్మకం ఉందని, అందుకే స్వామివారిని దర్శించుకునేందుకు తనకి అనుమతినివ్వాలని కోరుతూ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. ఈ డిక్లరేషన్ ఫాం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed