హాలీవుడ్ యాక్షన్ చిత్రం కాదు.. మన వాళ్ళ టాలెంట్! హైవేపై రన్నింగ్ లారీ నుంచి బాక్స్ చోరీ

by Ramesh N |
హాలీవుడ్ యాక్షన్ చిత్రం కాదు.. మన వాళ్ళ టాలెంట్! హైవేపై రన్నింగ్ లారీ నుంచి బాక్స్ చోరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: హాలీవుడ్‌ యాక్షన్ చిత్రం ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ అనే సినిమా అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో వేగంగా వెళ్తున్న వాహనాలను చేజ్ చేయడం చూసే ఉంటారు. మరోవైపు వాటిలో ఉన్న వస్తువులను దొంగతనం చేయడం.. అంతే ఈజీగా కిందకు దిగడం లాంటివి సినిమాలో హైలెట్ సీన్స్‌గా ఉంటాయి. దాదాపు హాలీవుడ్ యాక్షన్ చిత్రాల్లో ఇలాంటి సీన్స్ ఎన్నో కన్పిస్తుంటాయి. ఈ క్రమంలోనే మేము ఏమీ తక్కువ కాదంటూ నేషనల్ హైవేపై రన్నింగ్‌లో ఉన్న లారీ నుంచి దొంగలు ఓ బాక్స్‌ను దొంగిలించారు. దీనికి సబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో ఉన్న ప్రకారం.. నేషనల్ హైవేలో స్పీడ్‌గా వేళ్తున్న లోడ్ లారీపై ఉన్న దొంగలు లారీ పట్టా పై బాగం కోసి ఓ బాక్స్ తీసి కిందకి పడేస్తారు.. వారిని మరో దొంగ బైక్‌పై ఫాలో అవుతారు.


లారీ డ్రైవర్‌కు ఎలాంటి అనుమానం రాకుండా ఆ బాక్స్ రోడ్డుపై పడేయగానే.. రన్నింగ్ లారీ నుంచి దొంగలు దిగుతారు. ఎలా అంటే ప్రమాదకర స్టంట్‌లు చేసి.. బాక్స్ కిందికి పడేసి.. బెరుకు లేకుండా బైక్‌పై ముగ్గురు యువకులు ఉడాయించారు. ఈ ఘటన ఆగ్రా- ముంబై హైవే మీద జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ తతంగమంతా మరో వాహనదారుడు వీడియో తీశాడు. దీంతో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ చిత్రం కాదు.. మన వాళ్ళ టాలెంట్ అని కామెంట్స్ పెడుతున్నారు.



Next Story

Most Viewed