గాలిలో ఎగురుతున్న యువతి.. దానికోసం ఎంత కష్టపడిందో..

by Sumithra |
గాలిలో ఎగురుతున్న యువతి.. దానికోసం ఎంత కష్టపడిందో..
X

దిశ, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎంతకైనా తెగించేందుకు సిద్ధంగా ఉంటున్నారు. హాస్యాస్పదమైన పనులు చేసేవాళ్లు కొంతమంది అయితే, మరి కొంతమంది తమ ప్రాణాలను పణంగా పెట్టి వైరల్ వీడియోలను తీస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చాలా మందిని చూస్తూనే ఉంటాం. ఎత్తు నుండి దూకడం, రోడ్లపై స్టంట్లు వేయడం, అలాగే రోడ్ల పై డాన్సులు వేయడం ఇలా చాలానే చేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఓ పాకిస్తానీ అమ్మాయి వార్తల్లోకి ఎక్కారు. ఆమె తన 20వ పుట్టినరోజు జరుపుకోవడానికి ఫోటోషూట్ చేసుకుంది. అది చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురి కాక తప్పలేదు. కొన్ని ఫోటోలలో ఈ అమ్మాయి బెలూన్ల సహాయంతో గాలిలో వేలాడుతున్నట్లు కనిపించింది.

రబీకా ఖాన్ ఒక పాకిస్తానీ ఇన్‌ఫ్లుయెన్సర్. ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 59 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇటీవలే ఆమెకు 20 ఏళ్లు వచ్చాయి. ఈ సందర్భంగా ఆమె ఫొటోషూట్ పూర్తి చేసింది. అందులో ఆమె నారింజ రంగు దుస్తులు ధరించి, చేతిలో చాలా బెలూన్‌లను పట్టుకుని కనిపించింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె బెలూన్ల సహాయంతో గాలిలో ఎగురుతున్నట్లుగా కొన్ని ఫోటోలు ఉన్నాయి. కానీ ఆ ఫోటోలో ఎలా ఎగురుతున్నారనే వాస్తవాలని తెలిపేందుకు రెబెక్కా ఆ ఫోటో షూట్ కి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది.

ఈ వీడియోలో రెబెక్కా క్రేన్ సహాయంతో గాలిలో ఎగురుతుండడాన్ని చూడవచ్చు. వీడియోను పోస్ట్ చేస్తూ ఆమె ఇలా రాసింది. క్రేన్ సహాయంతో గాలిలో వేలాడడం చాలా కష్టం. నేను దీన్ని కచ్చితంగా చేయాలనుకున్నాను కాబట్టే చేశాను. అందుకే ఇలాంటివి చేసేటప్పుడు మీ మీద నమ్మకం ఉంచండి అని రాశారు.

Video credits by rabeecakhan

Next Story

Most Viewed