BIG ALERT : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. జీహెచ్ఎంసీ కీలక సూచన

by M.Rajitha |
BIG ALERT : హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షం.. జీహెచ్ఎంసీ కీలక సూచన
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్(Hyderabad) నగరంలో అనేక చోట్ల భారీ వర్షం కురుస్తోంది. ఈదురు గాలులకు తాకిడికి పలుచోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. డీఆర్ఎఫ్ సిబ్బంది రంగలోకి దిగి విరిగిన చెట్లను తొలగిస్తున్నారు. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, ఉప్పల్, తార్నాక తదితర చోట్ల కుండపోత వాన కురుస్తోంది. ఐటీ కారిడార్ లో విపరీతమైన ట్రాఫిక్ జాం ఏర్పడి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా నేటి అర్దరాత్రి వరకు వర్షం కొనసాగుతుందని వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో నగర వాసులకు జీహెచ్ఎంసీ(GHMC) కీలక సూచనలు జారీ చేసింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావొద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసర సేవల కోసం 040-21111111, 9000113669 నంబర్లలో తమను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed