without traffic signals: ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని నగరం.. మన దేశంలోనే ఉందని తెలుసా?

by Javid Pasha |
without traffic signals: ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేని నగరం.. మన దేశంలోనే ఉందని తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు పట్టణాలు, నగరాల విస్తీర్ణం, జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. అదే సందర్భంలో ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురవుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో తరచూ వాహనాల రద్దీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యకు పరిష్కారంగా సరైన రోడ్డుమార్గాలు, ట్రాఫిక్ నిబంధనలు ప్రభుత్వాలు అమలు చేస్తుంటాయి. అలాంటి వాటిలో సిగ్నలింగ్ వ్యవస్థ కూడా ఒకటి. ట్రాఫిక్ నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తుంది.

నిజానికి ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి లేకపోతే రోడ్లపై వాహనాల రద్దీ పెరుగుతుంది. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. రోడ్డు దాటే క్రమంలో ప్రమాదాలు జరుగుతాయి. రవాణా మార్గాలు అస్థవ్యవస్థంగా తయారవుతాయి. కాబట్టి ఇవి తప్పనిసరి. కానీ మనదేశంలో గల ఒకానొక సిటీలో మాత్రం అస్సలు ట్రాఫిక్ సిగ్నల్సే ఉండవట. అయినా అక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని చెప్తుంటారు. అదే రాజస్థాన్‌లోని కోట నగరం (Kota City). ట్రాఫిక్ జామ్‌ల నుంచి బయటపడేందుకు ఈ సిటీలో అండర్ పాస్‌లు ఎక్కువగా నిర్మించడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడం లేదట. అందుకని ట్రాఫిక్ సిగ్నల్స్ పడి, గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయే పరిస్థితి ఇక్కడ అస్సలు ఉండదు.

Next Story

Most Viewed