Congress: కేటీఆర్ బలుపు మాటలు మానుకో.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్

by Ramesh Goud |
Congress: కేటీఆర్ బలుపు మాటలు మానుకో.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకోవాలని, నువ్వు చేస్తే సంసారం.. పక్కవాళ్లు చేస్తే వ్యభిచారమా అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.పార్టీ పిరాయింపులపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. పదేళ్లలో పార్టీ పిరాంపులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నువ్వు నీతులు చెబుతావా అని, 60 కి పైగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోని ఇప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. గతంలో ప్రగతిభవన్ లో ప్రజాప్రతినిధులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్న వెధవ ఎవరని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను భయ బ్రాంతులకు గురిచేసి, రోజుకొకరిని పార్టీలో చేర్చుకొని విలీనం అని పచ్చి అబద్దాలు మాట్లాడిన దగాకోరులు ఎవరని మండిపడ్డారు. పదేళ్ల పాటు మీరు ప్రదర్శించిన అతి తెలివిని ప్రజలు చూశారని, ఇప్పుడు ప్రజాస్వామ్యం, రాజ్యంగం అని నీతులు వల్లిస్తున్నావా అని విమర్శలు చేశారు.

రాష్ట్రంలో సిగ్గు, లజ్జ, మర్యాద లేని బతుకులు కల్వకుంట్ల కుటుంబానివి అని, మీ బాగోతాలు ఎవరికి తెలియవు అన్నట్లు సుద్దపూస మాటలు మాట్లాడుతున్నావా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో జీరో ఇచ్చినా మీకు బుద్ది రాలేదని, ప్రజలు ఛీ కొట్టినా రోజు ఏదో ఒక వంకతో మీడియా ముందుకు వచ్చి సొల్లు వాగుడు వాడుతున్నాడని మండిపడ్డారు. సీఎం ను ఆడిపోసుకోవడమే నీ దొంగల ముఠాకు పనిగా మారిందని, తెలంగాణలో మీకు నూకలు చెల్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. ఇక కేటీఆర్ పదే పదే ఉప ఎన్నికల గురించి మాట్లాడుతున్నాడని.. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుచిత్తు చేశామని, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో నిన్ను అడ్రస్ లేకుండా చేశామని తెలిపారు. ఈ సారి మళ్లీ ఉప ఎన్నికలు వస్తే నీ పార్టీనే అడ్రస్ లేకుండా చేస్తామని, బలుపు మాటలు తగ్గించుకొని, ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఆది శ్రీనివాస్ హెచ్చరించారు.

Next Story