పురి విప్పి నెమలి నాట్యం.. కామారెడ్డిలో అద్భుత దృశ్యం చూశారా?

by Ramesh N |   ( Updated:2024-04-12 13:04:10.0  )
పురి విప్పి నెమలి నాట్యం.. కామారెడ్డిలో అద్భుత దృశ్యం చూశారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: చిన్నారుల నుంచి పెద్దవారి వరకు నెమలిని చూడటం అందరికీ ఆసక్తి. నెమలి పురి విప్పితే చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. అదే పురివిప్పి నాట్యం చేస్తే ఆ దృశ్యం వర్ణించడానికి కూడా మాటలు ఉండవు. అద్భుతమైన నెమలి నృత్యాన్ని చూస్తే ఎంతటి వారైన మైమరిచి పోవాల్సిందే. ఈ నేపథ్యంలోనే నెమలి నాట్యం చేస్తున్న అద్భుత దృశ్యం తాజాగా కెమెరా కంటికి చిక్కింది. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా అడవుల్లో నీటి గుంటల వద్ద నీళ్లు తాగడానికి నెమళ్లు వచ్చాయి. ఈ క్రమంలోనే రెండు మయూరాలు పురివిప్పి నాట్యం చేసే అద్భుత దృశ్యం కనిపించింది.

సాధారణంగా ఆడ నెమలిని ఆకట్టుకునేందుకు మగ నెమళ్లు పింఛం విప్పి నాట్యం చేస్తుంటాయి. దీనికి సంబంధించిన వీడియో ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీంతో నెమళ్ల నాట్యం.. నెటిజన్లు కట్టిపడేసింది. అయితే గతంలో దుర్గం చెరువు, రాయదుర్గం, గచ్చిబౌలి, మాదాపూర్ హిల్ ఏరియాల్లో నెమళ్లు వచ్చేవని, ఇప్పుడు కనిపించడం లేదని ఓ నెటిజన్ గుర్తుచేశారు.

Advertisement

Next Story