- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video: ఏక్ ధక్కా మార్‌కే.. రైల్ చల్తా భాయ్..! ఆగిన రైలును నెట్టిన ప్రయాణికులు
దిశ, డైనమిక్ బ్యూరో: హలో భాయ్ సాబ్.. ఏక్ ధక్కా మార్కే బస్ చడో భాయ్.. ఆర్టీసీ బస్సులు మొరాయించినప్పుడు డ్రైవరన్న అనే మాట. అరె ఈ దొబ్బుడెందన్న అనుకుంటూనే ప్రయాణికులు బస్సు స్టార్ట్ అయ్యే వరకు కష్టపడి దొబ్బుతారు. ఇలానే నడి రోడ్లపై వెహికల్స్ ఆగిపోయినప్పుడు ఇతరులు నెట్టడం లాంటి ఘటనలు అనేకం చూసి ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఓ విచిత్ర ఘటన జరిగింది. కొందరు ప్రయాణికులు ఏకంగా రైలునే నెట్టారు. అవును మీరు విన్నది నిజమే. రైల్వే ట్రాక్‌పై ఆగిపోయిన ఎక్స్‌ప్రెస్ రైలును ప్రయాణికులు నెట్టడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీహార్- లఖిసరాయ్‌లోని కియుల్ జంక్షన్ స్టేషన్‌లో ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
అయితే ఆ ఎక్స్‌ప్రెస్ రైలులో చిన్నగా మంటలు వచ్చాయని, దీంతో ఆ కోచ్ నుంచి రైలు బోగీలను వేరు చేసే క్రమంలో రైల్వే సిబ్బంది ప్రయాణికుల సహాయం తీసుకుందని వీడియో వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు ఆ ఎక్స్‌ప్రెస్ రైలును ఆగిన బస్సును దొబ్బే నట్లే దొబ్బుతున్నారని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. బస్సులనే కాదు.. రైలును కూడా నెట్టగలమని ప్రయాణికులు నిరూపించారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.