Viral Video : అదిరింద‌మ్మా నీ అవతారం! రోడ్డుపై టవల్‌తో యువతి చక్కర్లు..

by Ramesh N |
Viral Video : అదిరింద‌మ్మా నీ అవతారం! రోడ్డుపై టవల్‌తో యువతి చక్కర్లు..
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫేమస్ అవ్వడం కోసం విచిత్రమైన వేషాలు వేస్తూ కొంతమంది రీల్స్ చేస్తున్నారు. వారు అనుకున్నట్లుగానే అలాంటి వీడియోలు తీసి పాపులర్ అయిపోతున్నారు.. అలాగే వార్తల్లో కూడా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ యువతి ముంబాయిలోని ఓ వీధిలో పగటి పూట ఒంటిపై టవల్‌తో నడుచుకుంటూ వెళ్తున్న వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడయా ఇన్‌ఫ్లూయెన్సర్, మిన్‌త్రా ఫ్యాషన్ సూపర్ స్టార్ విజేత అయిన తనుమితా ఘోష్.. పింక్ టవల్‌తో బోల్డ్‌గా రోడ్డుపైకి వచ్చి.. వీడియోలు తీసుకోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.

బీజీగా ఉండే రోడ్డుపై బస్ స్టాప్ నుంచి సమీపంలోని హోటల్‌కి నడుచుకుంటూ, బెంచ్‌పై కూర్చున్నప్పుడు వీధిలో నడుస్తున్న వ్యక్తులు ఆమెను చూస్తున్నట్లు వీడియోలో కన్పిస్తోంది. అలా రోడ్డుపై తిరిగి తర్వాత ఒక్కసారిగా టవల్ విప్పుతుంది.. కానీ లోపల ఓ బ్రాండ్ డ్రెస్ వేసుకుని ఉంటుంది.. దీంతో ఆమె అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇది పాత వీడియో షూట్ అని తను ఇన్‌స్టాలో తాజాగా పోస్ట్ చేసింది. 2019 ఫ్యాషన్ షోలో భాగంగా ఈ వీడియో చిత్రీకరించారని, కాబట్టి దయచేసి అంత సీరియస్‌గా తీసుకోకండి అంటూ షేర్ చేసింది. వీడియోపై నెటిజన్లు ఆమెను విమర్శిస్తున్నారు. అదిరిందమ్మా నీ అవతారం.. కానీ ఇంకోసారి ఇలాంటివి ప్రయత్నించవద్దని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. “ఉర్ఫీ జావేద్ కి చోటి బెహన్” అంటూ మరికొందరు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed