- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Monalisa : మోనాలిసా హోం టూర్

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(PrayagRaj)లో మహాకుంభమేళా(MahaKumbhamela)లో సెన్సేషన్‌గా మారిన మోనాలిసా(Monalisa) గురించి తెలిసిందే. కాగా తన పట్ల చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపింది ఈ కాటుక కళ్ల చిన్నది. తన ఇంటిని చూపిస్తూ(Home Tour) తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ ఓ వీడియో చేయగా.. ప్రజెంట్ నెట్టింట్లో ఆ వీడియో వైరల్ గా మారింది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు సమీపంలోని ఓ చిన్న పల్లెలో నివసించే మోనాలిసా తాను ఎలాంటి ఇంట్లో ఉంటుందో చూపించింది. "నేను ఉండే ఇళ్ళు ఇదే. ఈ ప్రాంతంలో ఓ వంద మంది జనం ఉంటారు. అలాంటి చిన్న ఊర్లో నేను, నా కుటుంబ సభ్యులతో కలిసి ఉంటాను. పూసలు, దండలు అమ్మడానికి కుంభమేళాకు వెళ్ళాను. కాని అనేకమంది నా వీడియోలు పదే పదే తీయడం, ఇంటర్యూలు ఆడగటంతో దండలు అమ్మడం కుదరక ఇంటికి వచ్చేశాను. నా ఇన్స్టాగ్రామ్(Instagram) హ్యాక్ చేశారు. దయచేసి దానిని తిరిగి ఇవ్వండి. దాని ద్వారా ఎంతోకొంత డబ్బులు సంపాదించుకోవాలని ఆశపడుతున్నాను" అంటూ ఓ వీడియోను ఎక్స్(X) వేదికగా పోస్ట్ చేసింది.