Malla Reddy: మనవళ్లకు సీఎం రేవంత్ ఆశీర్వాదం ఇప్పించిన మల్లారెడ్డి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |
Malla Reddy: మనవళ్లకు సీఎం రేవంత్ ఆశీర్వాదం ఇప్పించిన మల్లారెడ్డి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి (Former Minister Malla Reddy) మనవరాలు, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి (MLA Rajashekar Reddy), మమత దంపతుల కుమార్తె శ్రేయారెడ్డి (Shreya Reddy) వివాహా వేడుక ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. శంషాబాద్‌ (Shamshabad)లోని జీఎంఆర్ కన్వెన్షన్‌ (GMR Convention)లో ఆదివారం వివాహం జరగగా.. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy), మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (Ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao) హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అదేవిధంగా ఇదే కార్యక్రమానికి బీఆర్‌ఎస్(BRS), బీజేపీ (BJP) పార్టీల నేతలు కూడా హాజరయ్యారు.

ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నూతన వధూవరులను ఆశీర్వదించేందుకు స్టేజ్‌పైకి సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడే ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి (Former Minister) తన మనవళ్లను సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పారు. దీంతో మనవళ్లు ఇద్దరూ సీఎం కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media)తో తెగ చక్కర్లు కొడుతోంది.

Advertisement

Next Story

Most Viewed