Viral Video : సుక్కేసిన చిరుత పులి.. మైకంలో తాగుబోతుకు మించిన లొల్లి..

by Sujitha Rachapalli |   ( Updated:2024-08-05 14:08:06.0  )
Viral Video : సుక్కేసిన చిరుత పులి.. మైకంలో తాగుబోతుకు మించిన లొల్లి..
X

దిశ, ఫీచర్స్: అసలే కోతి ఆపై కల్లు తాగింది అనే సామెత ఓల్డ్ వెర్షన్.. అసలే చిరుత ఆపై సుక్కేసింది అనేది న్యూ వెర్షన్. అదేంటి అనుకుంటున్నారు కదా. అవును నార్త్ ఇండియాలోని ఓ గ్రామంలో చిరుత చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. విలేజ్ లోని సారాయి దుకాణంలోకి ప్రవేశించిన లియోపార్డ్.. అనుకోకుండా లిక్కర్ తాగేసింది. మైకంలోకి వెళ్ళిపోయింది. మొత్తానికి ఈ సమయంలో తాను ఒక వైల్డ్ యానిమల్ అని.. మనుషులను చంపి తినేసే సామర్థ్యం ఉందని మరిచిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. కుక్కని ఎలా ట్రీట్ చేస్తారో దానితో కూడా భయం లేకుండానే ప్రవర్తించారు. ఎలాగూ దాడి చేయదు కాబట్టి నడిపించుకుంటూ వెళ్లి అడవిలో వదిలేశారు అనే స్టోరీతో సోషల్ మీడియాలో ఓ వీడియో ట్రెండ్ అవుతుంది.

అయితే ఇదంతా అవాస్తవమని కొందరు కొట్టిపారేస్తున్నారు. చిరుతకు నంబ్ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల అలా మైకంలోకి వెళ్లిపోయిందని అంటున్నారు. అందుకే జనాలు అంత భయం లేకుండా బిహేవ్ చేస్తున్నారని.. మేకను తీసుకుపోయినట్లు తీసుకుపోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఇండియాలో మాత్రమే ఇలాంటి వింతలు జరుగుతాయని మరికొందరు అంటున్నారు.

(VIDEO CREDITS NEWSBLARE INSTAGRAM CHANNEL)

Advertisement

Next Story