- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Curdi: ఏడాదిలో ఒక నెల మాత్రమే కనిపించే గ్రామం ఎక్కడుందో తెలుసా?
దిశ, వెబ్ డెస్క్ : బద్రినాధ్ వంటి ఆలయాలు కేవలం 6 నెలలు మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటుందని మనకి తెలిసిందే. ఆలయాన్ని మూసి వేసే ముందు వెలిగించిన అఖండ దీపం తిరిగి ఆరు నెలల తర్వాత తెరిచి చూస్తే.. అలాగే వెలుగుతుంటుంది. అలాంటి ఎన్నో వింతలు మన దేశంలో ఉన్నాయి. అలాంటి ఒక ప్రదేశమే గోవాలో ఉంది. 11 నెలల పాటు ఆ గ్రామం నీటిలోనే ఉండి వేసవిలో మాత్రమే పైకి తేలే ఆ ప్రదేశాన్ని చూడటానికి పర్యాటకులు వెళ్తుంటారు.
అందమైన దృశ్యాన్ని చూపేందుకు ఎంతోమంది ఉత్సాహం చూపుతుంటారు. అదే గోవా లోని కుర్దీ గ్రామం. కొండల మధ్య సరయు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నది పరివాహక ప్రాంతంలో కుర్దీ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఒకప్పుడు 3000 వేలకు పైగా ప్రజలు నివసించేవాళ్లు. అప్పటి ప్రభుత్వం ఇక్కడ జలాశయం నిర్మించాలని నిర్ణయం తీసుకొని ప్రజలందరితో సమావేశమయ్యి వారి అంగీకారం తీసుకున్నాకే ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను కోరారు. ఆనకట్ట నిర్మాణం జరిగితే వందల గ్రామాలకు మంచి జరుగుతుందని ఊరిని ఖాళీ చేసి మొత్తం 600 కుటుంబాలు చుట్టు పక్కల గ్రామాలకు వెళ్లి పోయారు.