యజమానిని కొట్టి చంపిన కంగారూ.. 85 ఏళ్ల తర్వాత ఇదే మొదటి ఘటన

by Mahesh |   ( Updated:2022-09-13 15:56:30.0  )
యజమానిని కొట్టి చంపిన కంగారూ.. 85 ఏళ్ల తర్వాత ఇదే మొదటి ఘటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఆస్ట్రేలియాలోని రెడ్‌మండ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎంతో ప్రేమతో పెంచుకున్న కంగారూ తన 77 ఏళ్ల యజమానిని కొట్టి చంపింది. 85 ఏళ్ల తర్వాత ఇలాంటి ఘటన జరిగిందని ఆస్ట్రేలియా జంతు అధికారులు తెలిపారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. గాయపడిన కంగారుకు చికిత్స చేయడానికి వెళ్లిన యజమానిని కంగారూ తన్నింది. దీంతో తీవ్ర గాయాలైన అతన్ని కాపాడటానికి వచ్చిన అత్యవసర సిబ్బందిపై కూడా ఆ కంగారూ దాడి చేసింది. దీంతో ఆ యజమాని అక్కడే మృతి చెందాడు. దీంతో కంగారూను అదుపు చేయలేకపోయిన అత్యవసర సిబ్బంది.. కంగారును చంపవలసి వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఈ టీచర్ రూటే వేరు.. 93 వయసులో ఎంతటి సాహసం చేసిందంటే?

Advertisement

Next Story