- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Girl Dancing in Towel : పిచ్చి పీక్స్ అంటే ఇదే! ఇండియా గేట్ ముందు.. టవల్ విప్పేసి డ్యాన్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, వివిధ సామాజిక మాధ్యమాల్లో ఫేమస్ అవ్వడం కోసం కొంత మంది క్రియేటివ్ కంటెంట్ చేస్తూంటే.. మరికొంత మంది వెకిలి చేష్టలతో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటారు. లైకులు, ఫాలోవర్స్‌ను పెంచుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా కోల్‌కతా మోడల్ సన్నతి మిత్రా ఢిల్లీలోని ఇండియా గేట్ ముందు పబ్లిక్‌లో ఒంటిపై తెల్లటి టవల్ చుట్టుకుని డ్యాన్స్ చేసింది.
లోపల దుస్తులు ధరించి ఒంటిపై కేవలం టవల్ మాత్రమే ఉన్నట్లు చుట్టుకుని బాలీవుడ్ పాటకు డ్యాన్స్ రీల్ షూట్ చేసుకుంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో పిల్లలతో సహా పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉన్నారు. దీనికి సంబంధించిన వీడియోను సన్నతి మిత్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు.. అంటూ వీడియో షేర్ చేసింది. మీరంతా ధైర్యం, దయ, సానుభూతితో ఇతరులను ప్రేరేపించడం, ప్రోత్సహించడం కొనసాగించండి అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియో పోస్ట్ చేసిన గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. వీడియో వైరల్ కావడంతో చాలా మంది నెటిజన్లు ఆమెను తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రీల్స్ పిచ్చి పీక్స్ అంటే ఇదే.. ఇండియా గేట్ ముందు ఈ విధంగా ప్రవర్తిస్తూ వీడియో చేయడం ఏమిటని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇలా బహిరంగ ప్రదేశాల్లో ఇలాంటి పిచ్చి రీల్స్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేశారు.