ఎలుక‌పైన ఏనుగు ప‌డితే.. అలాగే ఈ ఆంటీ.. పాపం! (వీడియో)

by Sumithra |   ( Updated:2023-06-20 11:07:50.0  )
ఎలుక‌పైన ఏనుగు ప‌డితే.. అలాగే ఈ ఆంటీ.. పాపం! (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః భారతీయ వివాహాల్లో అంకుల్స్‌, ఆంటీల డ్యాన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప‌ట్ట‌రాని ఉత్సాహంతో వాళ్లు చేసే డ్యాన్స్ మ‌ధ్య‌లో ఎవ్వ‌రు ఎదురొచ్చినా వాళ్ల పాదాల కింద ప‌చ్చ‌డి కావాల్సిందే! లేదంటే, ముఖంపై ఒక పంచ్, ఇంకా కాదంటే, డ్యాన్స్ ఫ్లోర్ బ‌య‌ట ప‌డాల్సిందే! అయితే, ఇలాంటి చోట పిల్ల‌లు కానీ ఈ పెద్దలు డ్యాన్స్ ఫ్లోర్ ఎక్కడం అంత‌ సురక్షితం కాద‌ని ఈ ఉదాహ‌ర‌ణ‌తో అర్థ‌మ‌వుతుంది. ఇలాగే, అనుకోకుండా ఓ పార్టీలో ఒక చిన్నారి బాలుడు హర్యాన్వీ పాటకు డ్యాన్స్ చేస్తున్న ఆంటీ వెనుక‌కు వెళ్లాడు. పాపం, అది గ‌మ‌నించ‌ని ఆంటీ డ్యాన్స్ త‌డ‌బ‌డి పిల్లాడిపై ప‌డిపోయింది. భారీ దేహంతో బాధ‌ప‌డుతున్న ఆమె లేత శ‌రీర‌మున్న‌ పిల్లాడిపై ప‌డ‌టంతో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

Advertisement

Next Story