HIV: హెచ్ఐవీ బాధితులకు భారీ గుడ్‌ న్యూస్.. వ్యాధి నివారణకు ఇంజెక్షన్ రెడీ!

by Shiva |   ( Updated:2024-07-08 11:02:01.0  )
HIV: హెచ్ఐవీ బాధితులకు భారీ గుడ్‌ న్యూస్.. వ్యాధి నివారణకు ఇంజెక్షన్ రెడీ!
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్వైర్డ్ ఇమ్యూనో డిఫీషియన్సీ సిడ్రోమ్ (AIDS) ప్రపంచ దేశాలకు ఓ పెను సవాలుగా మారిన ఓ వైరస్. ఆ వ్యాధి బారిన పడి ఇప్పటికే లక్షల్లో జనం ప్రాణాలు విడిచారు. అయితే, వ్యాధిని నివారించేందుకు మాత్రం శాస్ట్రవేత్తలు మందును కనిపెట్టేందుకు కొన్నేళ్లుగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో వారు అద్భుతం చేశారు. హెచ్ఐవీని సమూలంగా నివారించేందుకు త్వరలోనే ఇంజెక్షన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. వ్యాధి బారిన పడిన వారు ఏటా రెండు సార్లు ‘లెనాకాపవిర్’ తీసుకుంటే ఇంజక్షన్‌తో పూర్తిగా వైరస్‌ను కట్టడి చేయవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, HIVని నియంత్రించేందుకు ప్రస్తుతం రెండు రకాల ట్యాబ్లెట్లు మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. 2012లో ట్రువాడా అనే మాత్రకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి తీసుకుని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. అనంతరం 2016లో డెస్కోవీ అనే ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. కాగా, ఆ రెండు ట్యాబ్లెట్లతో సరిచూస్తే క్లినికల్ ట్రయల్స్‌లో ‘లెనాకాపవిర్’ ఇంజక్షన్ వందశాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Advertisement

Next Story