ఎస్ బీఐలో 10వేల ఉద్యోగాల భర్తీ ..600 కొత్త శాఖల ఏర్పాటు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-10-06 12:51:27.0  )
ఎస్ బీఐలో 10వేల ఉద్యోగాల భర్తీ ..600 కొత్త శాఖల ఏర్పాటు
X

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. ఈ ఏడాది 10వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ఎస్ బీఐ చైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి ప్రకటించారు. అదేగాక దేశవ్యాప్తంగా 22,542 శాఖలుండగా ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా కస్టమర్ల కోసం మరో 600 శాఖలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సాధారణ బ్యాంకింగ్‌ అవసరాలు, సాంకేతికంగా బ్యాంకులను బలోపేతం చేసేందుకు మరిన్ని ఉద్యోగాలు కల్పించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఎస్ బీఐలోని వివిధ భాగాల్లో 1500 మంది సాంకేతిక నిపుణుల నియామకాలను చేపట్టాలని నిర్ణయించినట్లు శ్రీనివాసులు తెలిపారు.

మార్చి 2024 నాటికి 2,32,296 మంది సిబ్బంది ఉన్నారని, అయితే మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా మరో 10వేల ఉద్యోగులు కావాలని...అందుకే డేటా సైంటిస్టు, డేటా ఆర్కిటెక్టు, నెట్‌వర్క్‌ ఆపరేటర్లతో సహా మరిన్ని విభాగాల్లో నియామకాలు చేపట్టబోతున్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed