- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
FIRE BATH : నిప్పు నీళ్లతో స్నానం ఎప్పుడైనా చూశారా? వైరల్ వీడియో
దిశ, డైనమిక్ బ్యూరో: ఎవరైనా చల్ల నీటితో లేదా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేస్తారు. చలికాలం అయితే నీళ్లు వేడి చేసి స్నానం చేస్తుంటారు. కానీ ఫైర్ బాత్ స్నానం ఎప్పుడైనా చేశారా? కనీసం చూశారా? అవును నిజంగానే ఫైర్ బాత్ స్నానం చేస్తున్నాడు ఓ వ్యక్తి, దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చూపిస్తున్న ప్రకారం.. ఒక పైప్‌లో మంటతో పాటు నీళ్లు ఒకేసారి కలిసి వస్తున్నాయి. ఓ వ్యక్తి అగ్నితో నీళ్లు వస్తున్న పైప్ కింద తల స్నానం చేశాడు. వాటర్ ఫాల్స్ వద్ద స్నానం చేస్తున్న తీరులో ఆ వ్యక్తి అగ్ని వాటర్‌తో ఎంజాయ్ చేస్తున్నాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహజ వాయువు, నిప్పు, నీరుతో స్నానం ఇదని, ఈ నీటిలో ఎక్కడో ఒక రకమైన గ్యాస్ ఉందని, దీంతో నీటితో పాటు తేలికగా మంటలు వస్తున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యక్తి లావా స్నానం చేస్తున్నాడని ఒక వ్యక్తి రాశాడు. ఈ వ్యక్తి స్నానం చేసిన తర్వాత సిగరెట్ వెలిగిస్తే, అతను పేలవచ్చు అని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు. నిప్పు నీళ్లలో స్నానం చేశాడని కొందరు వ్యక్తులు అతని ఆరోగ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇలా చేయడం ప్రమాదకరమని నెటిజన్స్ అంటున్నారు. కాగా, ఈ విచిత్రమైన ఘటన రష్యాలో జరిగిందని చెబుతున్నారు.