ఇది మామూలు ప్లాన్ కాదు గురు.. ఇప్పుడెంత వర్షం వచ్చిన ఈ గణేషుడికి ఎమ్ కాదు

by Mahesh |
ఇది మామూలు ప్లాన్ కాదు గురు.. ఇప్పుడెంత వర్షం వచ్చిన ఈ గణేషుడికి ఎమ్ కాదు
X

దిశ, వెబ్ డెస్క్: మనుషుల ఆలోచనలకు పదును పెడితే కాని పని అంటూ ఎమ్ ఉండదు. నేటి సమాజంలో చాలామంది.. తాము అనుకున్న పని పూర్తి చేయడానికి కఠోర శ్రమతో పాటు ఆలోచన శక్తిని ఉపయోగించి.. అసాధ్యం అనుకున్న పనిని కూడా చేసి చూపిస్తారు. అయితే కొంతమంది మాత్రం ఎంత పెద్ద సమస్య అయినా.. చిన్న ఆలోచనతో.. అందరి కంటే భిన్నంగా ఆలోచించి చేస్తారు. ఇలాంటి పనినే ఓ గ్రామంలోని యూత్ చేసి ప్రస్తుతం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. దేశంలో ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు ప్రారంభం అయ్యాయి. కాగా తెలుగు రాష్ట్రాల్లో గత 10 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో వినాయక మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగా ఓ యూత్ అందరికంటే భిన్నంగా ఆలోచించు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఏకంగా వాటర్ ట్యాంక్ పైన ఫస్ట్ ఫ్లోర్ లో వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కోసం ప్రత్యేకంగా సెంట్రింగ్ కొట్టించుకున్న నిర్వాహకులు..మెట్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఆ యూత్ చేసిన పనికి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. కాగా ఆ వినాయక మండపానికి సంబంధించిన ఫొటోలపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed