- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొబ్బరి చిప్పకు ఫుల్ డిమాండ్.. దాని ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే?
దిశ, ఫీచర్స్: ఇండియాలో కొబ్బరికాయల వాడకం చాలా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వారానికి ఒక్కసారైనా ఇంట్లో పూజ చేసినప్పుడు లేదా ఏవైనా శుభకార్యాలు జరిగినప్పుడు శుభం జరగాలని కొబ్బరికాయను పగలగొడతారు. అలాగే కొబ్బరిని వంటకాల్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇక జ్వరం, లేదా అనారోగ్యానికి గురైనప్పుడు కూడా కొబ్బరి నీరును తాగిస్తుంటారు. అయితే పల్లెటూర్లలో కొబ్బరికాయను కొట్టినప్పుడు అందులోని నీరును, కొబ్బరిని ఉపయోగించి ఆ చిప్పతోనే గోరింటాకును కూడా తయారు చేస్తారు. కానీ కొందరు దానితో ఉపయోగం లేదని చిప్పను పడేస్తుంటారు.
కానీ పనికిరాని చిప్పను కొంతమంది నగరాల్లోని జనాలు డబ్బులు పెట్టి మరీ విక్రయిస్తూ పలు వంటలు ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా ఇంట్లో డెకరేషన్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. అయితే చిప్పలను కొంతమంది ఆన్‌లైన్‌లో వేలకు వేలు పెట్టి కొంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. తాజాగా, ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ వెబ్‌సైట్ రెండు కొబ్బరి చిప్పలను 21.30 డాలర్లుకు విక్రయిస్తున్నట్లు సమాచారం.
అంటే మన కరెన్సీలో రూ. 1786 అని తెలుస్తోంది. ఇక వాటిని డోర్ డెలివరీ చేయాలంటే రూ. 1600 చార్జ్ చేస్తుందట. మొత్తం కలిపి రెండు చిప్పలను రూ. 3386కు అమ్ముతున్నారని సమాచారం. ఇక అమెజాన్‌లో ఈ కొబ్బరి చిప్పలు రూ. 99 నుంచి మొదలై 1300 పైగా ధరలతో అందుబాటులో ఉన్నాయి. ప్రజెంట్ కొబ్బరి చిప్పల ధరలు నెట్టింట వైరల్ కావడంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్ అవుతున్నారు.