పిచ్చి పీక్స్.. బారికేడ్లకు నిప్పుపెట్టి.. ట్రాఫిక్‌లో రీల్స్.. ఇంకెన్ని దారుణాలో?

by Ramesh N |   ( Updated:2024-04-02 12:42:19.0  )
పిచ్చి పీక్స్.. బారికేడ్లకు నిప్పుపెట్టి.. ట్రాఫిక్‌లో రీల్స్.. ఇంకెన్ని దారుణాలో?
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాపులర్ అవ్వడం కోసం ఈ మధ్య ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తూ ఇన్‌స్టా రీల్స్ షూట్ చేసుకుంటున్నారు. ఇటీవల హోలీ పండుగ సందర్భంగా ఇద్దరు యువతులు స్కూటీపై రొమాన్స్ చేసిన ఘటన మరువక ముందే తాజాగా మరో ఇన్‌స్టాగ్రామ్ రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇద్దరు యువకులు నార్త్ ఢిల్లీలోని పశ్చిమ విహార్ సమీపంలోని ఫ్లైఓవర్ పై ఫుల్ ట్రాఫిక్ ఉన్న సమయంలో కారు ఆపి రీల్స్ చేశారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మరోవైపు కారు డోర్ తెరిచి ఢిల్లీలో డ్రైవింగ్ చేస్తూ రీల్స్ చేశారు. అదే వ్యక్తులు మరో రీల్‌లో ఏకంగా ఢిల్లీ పోలీసుల బారికేడ్‌కు నిప్పుపెట్టి రీల్స్ షూట్ చేశారు.

ఢిల్లీలో ప్రదీప్ ధకజాత్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ రీల్ చేసి పోస్ట్ చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై నెటిజన్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై ఢిల్లీలోని నిహాల్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా నిందితులు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed