- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లిని పెళ్లిబట్టల్లో చూసి, వధువు కొడుకు ఇలా చేశాడు! వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్ః ఇటీవలి ఓ తెలుగు సినిమాలో తన తల్లికి మళ్లీ పెళ్లిచేయాలనుకుంటాడు హీరో. సాధారణంగా ఇలా 'సంస్కార' విరుద్ధ స్త్రీ పాత్రలేవైనా ఇండియన్ సినిమాల్లో, ముఖ్యంగా తెలుగు సినిమాల్లో చచ్చిపోతుంటాయి. కానీ, నిజ జీవితంలో, ఇదేదేశంలో విధవరాలైన తల్లికి పెళ్లిచేసిన కొడుకులు మంచి ప్రశసంలు అందుకున్నారు. మన సంగతి పక్కనపెడితే, కొన్ని విదేశీ సంస్కృతుల్లో మరో పెళ్లి అనేది మామూలు విషయం. ఇప్పుడు చెప్పుకునే ఈ వైరల్ వీడియోలో మూడేళ్ల కొడుకే తన తల్లి పెళ్లికి రింగ్ బేరర్‌గా మారాడు. పెళ్లి బట్టల్లో తల్లి వివాహ వేదిక వద్దకు నడిచొస్తుంటే, తన తల్లిని చూసిన కొడుకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కౌగిలించుకుంటాడు. హృదయాన్ని కరిగించే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో గుడ్ న్యూస్ కరస్పాండెంట్ అనే పేజీ పోస్ట్ చేసింది, "'హే మామ్!' అంటూ తల్లిని దగ్గరకు పరిగెత్తూ వెళ్లే పిల్లాడి వీడియోకు వేలల్లో వ్యూవ్స్, లైక్‌లు వచ్చాయి. అందమైన స్ట్రాప్‌లెస్ తెల్లటి వెడ్డింగ్ గౌన్ ధరించిన వధువు, తన బిడ్డను హత్తుకునే క్షణం ఉద్వేగంతో ఆమె కళ్లు చమర్చడం నెటిజన్లకు చూడ ముచ్చటగా అనిపించింది. ఆ తర్వాత ఆమె తన కొడుకు చేతిని పట్టుకుని నడుస్తుంది. ఒకరు "నేను దీన్ని కనీసం 20 సార్లు చూశాను" అంటే ఇంకొకరు, "ఓహ్ మై గాడ్ ఎంత అద్భుతమైన మధురమైన క్షణం!" అని వ్యాఖ్యానించారు. "స్వచ్ఛమైన అమాయకత్వం, ప్రేమ"ను కురిపించే ఈ వీడియో నెటిజన్లకు తెగ నచ్చేసింది.