- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిర్యానీ ‘పేపర్ ప్లేట్స్’పై దేవుని ఫోటోలు! ఢిల్లీలో వివాదాస్పద ఘటన
దిశ, డైనమిక్ బ్యూరో: దేశ రాజధాని నార్త్ ఢిల్లీలోని ఓ బిర్యానీ సెంటర్ వద్ద పేపర్ ప్లేట్స్‌పై రాముడి ఫోటోలు ఉండటం వివాదాస్పదంగా మారింది. దేవుడి పోటోలు ఉన్న డిస్పోజబుల్ ప్లేట్స్‌లోనే బిర్యానీ వడ్డిస్తున్నారని గందరగోళం చెలరేగింది. ప్రజలకు ఈ ప్లేట్స్‌పై బిర్యానీ వడ్డించడం, వాటిని ఉపయోగించిన తర్వాత చెత్తకుప్పలో కూడా పారవేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఆదివారం స్థానిక హిందూ సంస్థలు బిర్యానీ దుకాణంలో ఉంచిన ప్లేట్లపై రాముని ఫోటోను గమనించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
వారు ఈ విషయంపై విక్రేతను ప్రశ్నించారు. దీంతో గందరగోళ వాతావరణం ఏర్పడటంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, రాముడి ఫోటో ఉన్న డిస్పోజబుల్ ప్లేట్ల ప్యాకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం పై తదుపరి విచారణ జరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో బిర్యానీ సెంటర్ యాజమానిపై మండిపడుతున్నారు.