- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SBI ATM నుంచి డబ్బులకు బదులు పాము పిల్లలు.. భయాందోళనలో కస్టమర్స్
దిశ, వెబ్ డెస్క్: ఏటీఎంలో డబ్బులకు బదులు పాములు వచ్చిన సంఘటన కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఇలాంటి షాకింగ్ ఘటనలు జరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో రామ్ నగర్ కోసీ రోడ్డులో ఉన్న ఎస్‌బీఐ ఎటీఎంకు డబ్బుల విత్‌డ్రా చేసుకోవడానికి బుధవారం సాయంత్రం ఓ వ్యక్తి వెళ్లాడు. ఆ తర్వాత ఏటీఎం కార్డ్ పెట్టి విత్‌డ్రా డబ్బులు చేయడానికి ప్రాసెస్ పూర్తి చేశాడు. అయితే డబ్బులు వస్తాయని ఎదురుచూస్తుండగా ఒక్కసారిగా మిషన్‌లోంచి పాము పిల్ల బయటకు వచ్చింది. దీంతో షాక్ అయిన కస్టమర్ భయపడిపోయి గట్టిగా అరిచాడు. వెంటనే అక్కడి నుంచి వెళ్లి ఏటీఎం సెక్యూరిటీకి జరిగిన విషయాన్ని తెలిపాడు. సమాచారం అందుకున్న బ్యాంకు అధికారులు ATM సెంటర్‌కు చేరుకున్నారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో సేవ్ ది స్నేక్ అండ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ చంద్రసేన్ కశ్యప్ కూడాఏటీఎం వద్దకు వచ్చారు. ఏటీఎంను తెరిచి చూడగా అందులో 10 పాము పిల్లలు బయటపడ్డాయి. వాటిని ఫారెస్ట్ ఏరియాలో వదిలిపెట్టారు. ఈ పాము పిల్లలు చాలా డేంజర్ అని అధికారులు తెలిపారు. దీంతో ఆ ఏటీఎంను తాత్కాలికంగా క్లోజ్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.