Viral: ఏనుగు పిల్లకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ.. ఎలిఫెంట్ ఫ్యామిలీ ఎంత చూడముచ్చటగా ఉంది (వీడియో)..

by Sujitha Rachapalli |   ( Updated:2024-05-20 10:47:00.0  )
Viral: ఏనుగు పిల్లకు జడ్ కేటగిరీ సెక్యూరిటీ.. ఎలిఫెంట్ ఫ్యామిలీ ఎంత చూడముచ్చటగా ఉంది (వీడియో)..
X

దిశ, ఫీచర్స్: IAS ఆఫీసర్ సుప్రియా సాహు పోస్ట్ చేసే వైల్డ్ లైఫ్ యానిమల్ వీడియోస్ కు ఇంటర్నెట్ లో సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది. అందుకే తన ట్విట్టర్ లో ఇలా వీడియో పోస్ట్ చేయగానే అలా వైరల్ అయిపోతుంది. ఇక తాజాగా ఆమె షేర్ చేసిన ఏనుగు ఫ్యామిలీ క్లిప్పింగ్ నెటిజన్ల మనసును దోచేసింది. మనుషుల మాదిరిగానే తమ పిల్లలపై ఇంత లవ్, కేరింగ్ ఉంటాయా అని ఆశ్చర్యపోతున్న జనాలు.. ప్యూర్ లవ్ తో కామెంట్స్ చేస్తున్నారు.

కాగా తమిళనాడులోని అణమలై టైగర్ రిజర్వ్ లో తీసిన వీడియోలో నాలుగు పెద్ద ఏనుగులు.. పిల్ల ఏనుగును మధ్యలో పడుకోబెట్టుకొని ఎలాంటి ఆపద రాకుండా రక్షిస్తున్నాయి. ఒక ఏనుగు అయితే మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకుంటూ కనిపించడం ఫిదా చేయగా.. ఈరోజు ఆన్ లైన్ లో చూసిన బెస్ట్ వీడియో ఇదే అంటున్నారు నెటిజన్లు. ఇందుకు థాంక్స్ చెప్తున్నారు. కాగా ఈ వీడియో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ ధను పరన్ క్యాప్చర్ చేయడం విశేషం.

Click Here For Twitter Post..

Advertisement

Next Story
null