ఇలా తయారయ్యారేంట్ర బాబు.. మద్యం తాగలేదని యువకుడిని దారుణంగా కొట్టిన తోటి విద్యార్థులు.. (వీడియో)

by Kavitha |   ( Updated:2024-09-13 04:47:41.0  )
ఇలా తయారయ్యారేంట్ర బాబు.. మద్యం తాగలేదని యువకుడిని దారుణంగా కొట్టిన తోటి విద్యార్థులు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మద్యం తాగడానికి నిరాకరించాడని ఓ యువకుడిని తోటి విద్యార్థులు దారుణంగా కొట్టారు. ఈ ఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హిమాచల్ ప్రదేశ్‌లోని బహ్రా యూనివర్సిటీలో ఎంబీఏ (MBA) చదువుతన్న రజత్ కుమార్‌ను.. తోటి సీనియర్ స్టూడెంట్స్ అతని రూం కి వెళ్లి ర్యాగింగ్ పేరుతో మద్యం సేవించాలని ఒత్తిడికి గురి చేశారు. కానీ అతను మద్యం తాగడానికి నిరాకరించడంతో ఆగ్రహంతో అతడిపై పిడిగుద్దులు కురిపిస్తూ బెల్టుతో దారుణంగా కొట్టారు. ఈ తతంగాన్ని ఓ విద్యార్థి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. అయితే ఈ వీడియోను చూసిన పోలీసులు దాడికి పాల్పడిన ముగ్గురు సీనియర్ స్టూడెంట్స్‌ను ర్యాంగింగ్ చట్టం కింద అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ వీడియో పై నెటిజన్లు మరీ ఇలా తయారయ్యారేంట్ర బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to telugu scribe X account)

Advertisement

Next Story

Most Viewed