AP Government:తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!

by Jakkula Mamatha |
AP Government:తెలుగు చిత్ర పరిశ్రమకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలుగు చిత్రపరిశ్రమ(Telugu film industry)కు ఏపీ ప్రభుత్వం(AP Government) శుభవార్త చెప్పింది. విశాఖలో షూటింగ్(Shooting) కోసం సింగిల్ విండో సిస్టం(Single window system) తీసుకొస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి(State Tourism Minister) కందుల దుర్గేష్ ప్రకటించారు. ఈ రోజు(శుక్రవారం) విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన టూరిజం అండ్ ట్రావెల్స్ సమ్మిట్‌(Tourism and Travels Summit)లో మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళితే 3-4 రోజులు అక్కడే ఉండేలా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్నారు. 2025-30 ఐదు ఏళ్లకు టూరిజం పాలసీ తయారవుతుందని తెలిపారు.

ఏపీలో టూరిజానికి పారిశ్రామిక హోదా ఇస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) అన్నారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలో గడిచిన 5 ఏళ్లలో పర్యాటకం(Tourism) నష్టపోయింది అని తెలిపారు. ఈ ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీట వేస్తుందన్నారు మినిస్టర్ కందుల దుర్గేష్ చెప్పారు. స్వదేశీ, ప్రసాద్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తీసుకొస్తామని ప్రకటించారు. తెలంగాణ(Telangana), ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో సినిమా చిత్రీకరణ(Filming a movie)లు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పారు. సినిమాల చిత్రీకరణ జరిగితే రెవెన్యూ పెరుగుతుంది. టికెట్ల ధరలు పెంచాలని వస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలకు సహకారం అందిస్తామని మంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed