- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి పొంగులేటి బాంబుల వ్యాఖ్యలకు కేటీఆర్ స్ర్టాంగ్ కౌంటర్
దిశ, వెబ్ డెస్క్ : దీపావళికి ముందే ఒకట్రెండు రోజుల్లో పొలిటికల్ బాంబులు(Political bombs) పేలబోతున్నాయని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy)చేసిన సంచలన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అంతే స్ట్రాంగ్ గా కౌంటర్ (Counter)వేశారు. సిరిసిల్లలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పొంగులేటి చెప్పిన పొలిటికల్ బాంబుల వ్యా్ఖ్యలను తెలిగ్గా కొట్టిపారేశారు. బహుశా పొంగులేటిపై జరిగిన ఈడీ రైడ్స్ గురించి ఆ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చంటూ, బీజేపీని బతిమాలాడుకుని కేసులు లేకుండా చేసుకున్న బాంబులేమోనని ఎద్దేవా చేశారు. సీఎం బామ్మార్ధి 1136కోట్ల బాంబు ఏమోనని సైటర్ వేశారు. ఏం చేస్తారో చేసుకోండి.. ఏం పిక్కుంటారో పిక్కోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ తోనే కొట్లాడామని, ఈ చిట్టి నాయుడు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తాడని, హౌల గాళ్ళకి భయపడుతానా అని కీలక వ్యాఖ్యలు చేశారు. చిల్లర కేసు పెట్టి జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే అని అన్నారు. ఒర్జినల్ బాంబులకే భయపడలేదు.. గీ సుతిల్ బాంబులకు, లక్ష్మి బాంబులకు భయపడనని కేటీఆర్ అన్నారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లి్స్తామని, బిల్డర్లను బెదిరించి, సెటిల్మెంట్లు చేసిన వారిని వదలబోమని హెచ్చరించారు.
ఫోన్ ట్యాపింగ్, ధరణి, కాళేశ్వరం అంశాల్లో ప్రధాన నేతలపై చర్యలుంటాయన్న పొంగులేటి వ్యాఖ్యలకు భయపడబోమన్నారు. చేతనైతే మొగోళ్లయితే ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. జగిత్యాల ఎంఎల్ఎ రాజకీయ వ్యభిచారి, పార్టీ మారిన 10 మంది రాజకీయ వ్యభిచారీలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో విచిత్రంగా జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే పరస్పరం చంపుకుంటున్నారన్నారు. పోలీసోళ్ల కుటుంబాలను పోలీసులే కొడుతున్నారన్నారు. మోడీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఆలస్యంగా తెలుసుకున్నారని కేటీఆర్ అన్నారు. గతంలో రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా పార్టీ ఫిరాయించినోళ్లను రాళ్ళతో కొట్టాలంటే ఇప్పుడు ఆయననే కొట్టాలన్నారు.