- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యం : ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
దిశ, అచ్చంపేట : అచ్చంపేటలోని అన్ని రంగాల అభివృద్ధి చేయడమే నా ప్రథమ కర్తవ్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. ఈ క్రమంలోనే పట్టణంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో రాజీవ్ ఎన్టీఆర్ స్టేడియంగా మార్పు చేస్తూ దారిని మరింత ఎక్కువ విస్తీర్ణం పెంచేలా చర్యలు తీసుకుంటూ, స్టేడియం కు అవసరమైన ఏర్పాట్లకు త్వరలోనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం స్టేడియాన్ని పరిశీలించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్టేడియం అభివృద్ధి చర్యల కోసం రూ. 13 కోట్లు నిధులు కేటాయించామన్నారు.
మార్కండేయ టెంపుల్ ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కులు సుందరీకరణ, స్విమ్మింగ్ పూల్ వంటి వాటి పైనే ప్రధానంగా దృష్టి పెట్టి పట్టణ వాసులకు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. స్టేడియంలో నూతనంగా అన్ని హంగులతో ప్రేక్షకులు కూర్చొని వీక్షించే విధంగా గ్యాలరీలు, రోడ్ల విస్తరణ, ఐమాక్స్ లైట్స్ తో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. పట్టణ ప్రజలకు ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసే విధంగా పార్కును కూడా ఇంకా అన్ని రకాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామన్నారు. అచ్చంపేట పట్టణంలో ఆర్టీసీ ఏర్పాటుచేసిన గ్యార్మి వేడుకల్లో ఎమ్మెల్యే నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, ఆర్డీఓ మాధవి, మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్, అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు.