మద్యం మత్తులో ఆటో డ్రైవర్.. ఎంత పనిచేశాడో చూడండి..

by Sumithra |
మద్యం మత్తులో ఆటో డ్రైవర్.. ఎంత పనిచేశాడో చూడండి..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : వాహనదారులు ట్రాఫిక్ పోలీసులను చూశారంటే చాలు ఎక్కడ ఏ పత్రాలు అడుగుతారో అని భయపడుతూనే ఉంటారు. అదే అన్ని పత్రాలు ఉన్న వారు నేరుగా ధైర్యంగా వెళ్లిపోతారు. అయితే ఓ ఆటో డ్రైవర్ మాత్రం ట్రాఫిక్ పోలీసులను నడిరోడ్డుపైనే చెంపమీద కొట్టాడు. సాధారణ పరిస్థితుల్లో అయితే ఎరుకూడా ట్రాఫిక్ పోలీసును కొట్టలేరు. ఎవరైనా తాగిన సమయంలోనే ఇలా చేసే ధైర్యం వస్తుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆటో డ్రైవర్ ట్రాఫిక్ పోలీసుతో తీవ్రవాగ్వాదానికి దిగాడు.

మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ ఆటోడ్రైవర్ మహిళ పై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అతన్ని ఆపడానికి ట్రాఫిక్ పోలీసు వచ్చినప్పుడు, అతను వెంటనే వారి పై దాడి చేశాడు. ఈ వైరల్ సంఘటన పై వ్యూవర్స్ తమ అభిప్రాయాన్ని కామెంట్స్‌లో కూడా తెలిపారు. ఈ పోస్ట్‌ పై యూజర్లు కూడా ట్రాఫిక్ పోలీసుల పక్షం వహిస్తూ ఆటో డ్రైవర్‌ పై విమర్శలు గుప్పిస్తున్నారు.

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీస్‌ని చెంపదెబ్బ కొట్టిన డ్రైవర్..

ఈ వీడియోలో ట్రాఫిక్ పోలీసు సిబ్బంది ఇద్దరు ఆటో డ్రైవర్లను రోడ్డు నుండి రిక్షాను తొలగించమని కోరుతున్నారు. అయితే డ్రైవర్ ఆటోను తొలగించకపోవడంతో ఆటోను తనిఖీ చేసేందుకు స్వయంగా రోడ్డుపైకి చేరుకున్నాడు. ఇంతలో ఆటో డ్రైవర్ చెంపదెబ్బ కొట్టాడు.

ప్రతిగా అతను ఆటో డ్రైవర్‌ను చెంపదెబ్బ కొట్టినప్పుడు అతను ముందు, వెనుక నుండి దాడి చేస్తాడు. ట్రాఫిక్ పోలీసుకు సహాయం చేయడానికి వచ్చిన ఇతర పోలీసు అధికారి కూడా అతన్ని కొట్టడం చూసి పారిపోతాడు.

మీడియా కథనాల ప్రకారం ఈ దాడి ఘటనలో ట్రాఫిక్ పోలీసు చెవికి గాయమైంది. అంతేకాకుండా అతను కూడా గాయపడ్డాడు. తాను తన సహోద్యోగులు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫ్లై ఓవర్ దగ్గర డ్యూటీ చేస్తున్నామని చెప్పాడు. ఇంతలో మద్యం మత్తులో ఉన్న కొందరు బాలిక పై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో వారిని అడ్డుకునేందుకు వెళ్లగా.. ఆటో డ్రైవర్‌ వారిపై నీళ్లు పోసి కొట్టాడు. ఈ వీడియోని @gharkekalesh ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియోని ఇప్పటివరకు 90 వేలకు పైగా వీక్షణలు, వందల కొద్దీ లైక్‌లు వచ్చాయి.





Advertisement

Next Story