హవ్వా.. 25ఏళ్ల తర్వాత మాజీ ప్రియుడు కనబడటంతో ఆపుకోలేక స్టేజీపైనే ఆ పని చేసిన హీరోయిన్..

by Sujitha Rachapalli |
హవ్వా.. 25ఏళ్ల తర్వాత మాజీ ప్రియుడు కనబడటంతో ఆపుకోలేక స్టేజీపైనే ఆ పని చేసిన హీరోయిన్..
X

దిశ, ఫీచర్స్ : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ లవ్ స్టోరీస్ గురించి ప్రత్యేక ఓ సినిమానే తీయొచ్చు. రవీనా టాండన్‌తో మ్యారేజ్ దాకా వచ్చి ఆగిపోవడం.. శిల్పా శెట్టితో డేటింగ్.. ఫైనల్‌గా ట్వింకిల్ ఖన్నాను పెళ్లి చేసుకోవడం.. ఇవి తెలిసినవి మాత్రమే తెలియని స్టోరీస్ ఎన్నో ఉన్నాయని రూమర్స్ కూడా ఉన్నాయి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నామంటే.. అనుకోకుండా ఎక్స్ లవర్ కలిసినప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఉదాహరణ దొరికింది కాబట్టి. లైమ్ లైట్‌లోనే ఇదంతా జరిగింది కాబట్టి చర్చించాల్సి వస్తుంది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఫ్యాషన్ డిజైనింగ్ దుస్తులను ధరించిన శిల్పా శెట్టి షో స్టాపర్‌గా మారింది. వైట్ శారీలో అందమే అసూయపడేలా వయ్యారాలు పోయింది. ఇదంతా పక్కన పెడితే ఇదే ఈవెంట్‌కు శిల్ప ఎక్స్ లవర్ అక్షయ్ కుమార్ కూడా అటెండ్ అయ్యాడు. అనుకోకుండా ఈ హీరోయిన్ స్టేజీ మీద ఉండగానే.. అక్షయ్ కూడా రావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరు సిగ్గుపడుతూనే ‘చురా కే దిల్ మేరా’ పాటకు స్టెప్పులేశారు. వీరిద్దరి కాంబినేషన్‌లోనే వచ్చిన ఈ సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ అదరగొట్టేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయిపోయింది. కాగా దీనిపై స్పందిస్తున్న జనాలు.. ‘‘పాత జ్ఞాపకాలు’’, ‘‘25ఏళ్ల తర్వాత ఎక్స్‌ను కలిస్తే జరిగేది ఇదే’’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అయితే మరికొందరు మాత్రం అందులో ఏముంది.. వారిద్దరు ఫ్రెండ్స్‌గా మూవ్ అయ్యారని అంటున్నారు. ప్రతి విషయంలో తప్పు వెతికితే ఎలా అని క్లాస్ పీకుతున్నారు.

Next Story