- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేవలం 3 సెకన్లలో మూడు దేశాలకు వెళ్లిన మహిళ.. గూగుల్ మ్యాప్స్ లో మాత్రం కాదండీ..
దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో చాలామంది ట్రావెలింగ్ ని ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారు ఒక్కో సమయంలో వారి ఉద్యోగాలను కూడా విడిచిపెడతారు. ఇంకా కొందరైతే తమ ఇంటిని, మొత్తం ఆస్తిని కూడా వదిలిపెట్టి ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కారును లేదా బస్సును తమ ఇల్లుగా మార్చుకుంటారు. అలా ప్రపంచం మొత్తాన్నే చుట్టేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి విషయాలు చాలానే వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రజలు విమానం లేదా క్రూయిజ్‌లో విదేశాలకు వెళతారు. అయితే ఈ మధ్యకాలంలో ఒక మహిళ కేవలం మూడు సెకన్లలో మూడు దేశాలను సందర్శించి వార్తల్లో ఎక్కింది.
సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది. అందులో ఒక మహిళ సెకన్లలో మూడు దేశాలకు వెళ్లడాన్ని చూడవచ్చు. ఆ మహిళ అడవిలాంటి ప్రదేశంలో ఉండి, అక్కడ ఉన్న గుండ్రటి సిమెంటు నేలపై మూడుసార్లు దూకి యుద్ధంలో గెలిచినట్లు ఆనందంగా ఉండటాన్ని వీడియోలో చూడవచ్చు. వాస్తవానికి, మహిళ మొదట జంప్ చేసినప్పుడు, ఆమె నేరుగా బెల్జియంకు వెళ్లి, రెండవ జంప్ తో ఆమె నెదర్లాండ్స్ సరిహద్దులోకి ప్రవేశించింది. అదేవిధంగా మూడవ జంప్ తీసుకున్న తర్వాత ఆమె జర్మనీకి వెళ్లింది. ఈ విధంగా ఆమె కేవలం మూడు సెకన్లలో మూడు దేశాలను సందర్శించింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో roxonajourney అనే ID తో షేర్ చేశారు.
Read More...
తస్మాత్ జాగ్రత్త.. వేసవిలో ప్రయాణాలు చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..