- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
చిన్నారులకు వీధి కుక్కలతో పెళ్లి చేస్తున్న తెగ.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే?
దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా కానీ కొంత మంది మూడ నమ్మకాలను నమ్ముతూ దారుణంగా ప్రవర్తిస్తున్నారు. మూడ నమ్మకాలను నమ్మి మరి కొంత మంది ఇతరుల ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడటం లేదు. ఇలాంటి ఘటనలు వార్తల్లో చాలానే చూస్తున్నాం. తాజాగా, మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒడిశాలో దుష్టశక్తులు దరి చేరకూడదని గిరిజన తెగ వారు చిన్నారులకు వీధి కుక్కలతో పెళ్లి చేస్తున్నారు.
వివరాల ప్రకారం.. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో సోరో బ్లాక్ బంద్ సాహి గ్రామానికి చెందిన 11 ఏళ్ల తపన్ సింగ్ అనే బాలుడికి ఓ ఆడ కుక్కతో పెళ్లి జరిపించారు. అంతేకాకుండా ఏడేళ్ల లక్ష్మీ అనే చిన్నారికి మగ కుక్కతో వివాహం చేశారు. చిన్నారుల నుంచి దుష్టశక్తులను పారదోలేందుకే వీధి కుక్కలతో వివాహం చేశామని గ్రామస్థులు తెలిపారు. హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడపై దంతాలు కనిపించడం అశుభంగా భావిస్తారు. అందుకే కుక్కలతో చిన్నారుల పెళ్లి జరిపించడం వల్ల మంచి జరుగుతుందని వారి నమ్మకం. దీంతో అది తెలిసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.