Variety Wedding Card: విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఫోన్ మాదిరి కొత్త రకం వెడ్డింగ్ కార్డు (వీడియో)

by Anjali |
Variety Wedding Card: విపరీతంగా ఆకట్టుకుంటోన్న ఫోన్ మాదిరి కొత్త రకం వెడ్డింగ్ కార్డు (వీడియో)
X

దిశ, ఫీచర్స్: ఇటీవల సోషల్ మీడియాలో రకరకాల పెళ్లి పత్రికలు వైరల్ అవుతున్నాయి. పూర్వంలో పెద్దలు ఒకే రకం వెడ్డింగ్ కార్డు ముద్రించి.. బంధువులను వివాహానికి ఆహ్వానించేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో తమ స్టేటస్‌కు దగ్గట్లు తమ తమ స్టైల్‌లో పెళ్లి పత్రికలు ముద్రిస్తున్నారు. ఇటీవల జరిగిన ముఖేష్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి బంగారంతో వెడ్డింగ్ కార్డు తయారు చేసినట్లు నెట్టింట వార్తలు వినిపించాయి. గత ఆరు నెలల కింద ఓ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపధ్యాయురాలు తన కుమార్తె పెళ్లికి కూరగాయలతో పెళ్లి కార్డు తయారు చేసింది.

ఛత్తీస్‌గఢ్‌లోని యశ్‌పూర్ జిల్లాలో లోహిత్ సింగ్ అనే ఓ వ్యక్తి ఆధార్ కార్డు రూపంలో పెళ్లి పత్రికు రూపొందించాడు. ఇలా రకరకాలుగా కొత్త కొత్త ఆలోచనలతో వెడ్డింగ్ కార్డులు ప్రింట్ చేయిస్తున్నారు. తాజాగా ఎవరూ ఊహించని విధంగా ఓ ఫ్యామిలీ వెరైటీ ఆహ్వాన పత్రికను ప్రింట్ చేశారు. ఫోన్ మాదిరిలో ఉన్న ఈ పెళ్లి పత్రిక నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అచ్చం ఫో‌న్‌లో వాల్ పేపర్ ఎలా పెట్టుకుంటారో ఈ ఆహ్వార పత్రికలో కూడా పిక్ పెట్టుకోవ్చు. చూడానికి ఎంతో చక్కగా ఉన్న ఈ కార్డు మొత్తం చూడాలంటే కింద లింక్ ఓపెన్ చేయండి.



Next Story