- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rain Water : ఒక చేత్తో గొడుగు.. మరో చేత్తో రైలు నడిపిన లోకో పైలట్..! వీడియో వైరల్
దిశ, డైనమిక్ బ్యూరో: భారీ వర్షాలకు రేల్వే ట్రాక్‌లు నీటిలో మునగడం చూసి ఉంటారు. మరోవైపు ట్రైన్ సీలింగ్ నుంచి నీరు కారడం చూసి ఉంటారు. కానీ ఏకంగా లోకో పైలట్ క్యాబిన్‌లో వర్షం నీరు పడటం చూశారా? అది కూడా భారీ స్థాయిలో.. ట్రైన్ నడిపే లోకోపైలెట్‌కే ఇలాంటి అనుభవం ఎదురైతే కొన్ని వందల మంది ప్రయాణికులను సేఫ్‌గా వారి వారి గమ్యస్థానాలకు ఎలా చేర్చగలడు. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక చేత్తో గొడగు పట్టుకోని మరో చేత్తో లోకో పైలట్ రైలు నడుపుతున్నారు. అతను తడవకుండా గొడుగు అడ్డం పెట్టుకొని, ట్రైన్ నడిపిస్తున్నాడు. అయితే, విషయం రైల్వే బోర్డుకు తెలిస్తే.. సస్పెండ్ చేస్తారన్న భయంతో పైలెట్ ముఖం చూపించడం లేదు. రైలు నంబర్‌ను కూడా చూపించలేదు.
వాన కాలంలో రైల్లో పరిస్థితులు చూపించడానికి.. వీడియో రికార్డు చేశారని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది భారత్‌కు చెందిన ట్రైన్ లేక బంగ్లాదేశ్ లాంటి ఇతర దేశాల ట్రైన్ అనేది తెలియాల్సి ఉంది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఈ వీడియో భారతీయ రైల్వే వ్యవస్థ కు చెంది ఉంటే తక్షణమే లోకో పైలట్ క్యాబిన్స్ పరిశీలించాలని ఇండియన్ రైల్వేకు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తున్నారు.