Viral: దర్జాగా సైకిల్ తొక్కుతున్న ఆవు.. షాకింగ్ వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు

by Hamsa |
Viral: దర్జాగా సైకిల్ తొక్కుతున్న ఆవు.. షాకింగ్ వీడియో చూసి నోరెళ్లబెడుతున్న నెటిజన్లు
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అభివృద్ధి చెందుతున్న కొద్ది చిత్ర విచిత్రాలు దర్శనమిస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు. అలాగే కొన్ని ఊహకందనివి ఎన్నో నెట్టింట వైరల్ అవుతుండటంతో ఇలా కూడా చేయవచ్చా అని కొందరు ట్రై కూడా చేస్తున్నారు. ప్రస్తుతం sirwan maghded అకౌంట్ నుంచి షేర్ చేసిన వీడియో ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. దీనిని లక్షల మంది ఇష్టపడుతూ నెట్టింట షేర్ చేస్తున్నారు.

అసలు అందులో ఏముందో ఇక్కడ తెలుసుకుందాం.. ఓ ఆవు దర్జాగా సైకిల్ తొక్కుతున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెద్దగా వాహనాలు రాని ఖాళీ ప్రదేశంలో ఒక జెర్సీ ఆవు సైకిల్ తొక్కుతోంది. తెలుపు, నలుపు రంగులో ఉన్న ఆవు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక అది చూసిన వారంతా నోరెళ్లబెడుతున్నారు. అలాగే కొందరు ఆవు బరువును సైకిల్ ఆపగలదా? ఒకవేళ వాహనాలు వస్తే ఎలా బ్రేక్ వేస్తోందని ఆలోచనలో పడ్డారు. మరికొందరు మాత్రం కంప్యూటర్ ద్వారా క్రియేట్ చేసిందని అంటున్నారు. ఈ వీడియో ఎడిట్ చేసింది ఎవరో కానీ అతని టాలెంట్‌ను అభినందిచాల్సిందే అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

(Video Link Credits to sirwan.maghded Instagram Channel)

Advertisement

Next Story

Most Viewed