'మా అమ్మ నా ఐస్ క్రీమ్ తినేసింది.. జైల్లో పెట్టండి' అంటూ పోలీసులకు ఫోన్ చేసిన 4 ఏళ్ల బాలుడు

by D.Reddy |
మా అమ్మ నా ఐస్ క్రీమ్ తినేసింది.. జైల్లో పెట్టండి అంటూ పోలీసులకు ఫోన్ చేసిన 4 ఏళ్ల బాలుడు
X

దిశ, వెబ్ డెస్క్: ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారు అల్లరి చేష్టలు ఇంట్లో వారందరికి ఎంతో నవ్వులు తెప్పిస్తాయి. కొన్ని సార్లు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తాయి. తాజాగా ఓ నాలుగేళ్ల బుడ్డోడు చేసిన పని కూడా అందరికి షాక్‌కు గురిచేసింది. ఏకంగా పోలీసులకు ఫోన్ చేసి తన తల్లిని అరెస్టు చేయాలంటూ కోరారు. ఇంతకీ వాళ్ల అమ్మ చేసిన నేరం ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిందంటే?

అమెరికాలో విస్కాన్సిన్‌లోని ఎమర్జెన్సీ సర్వీస్ కాల్ సెంటర్‌ 911కు నాలుగేళ్ల బాలుడు ఫోన్ చేశాడు. త్వరగా వచ్చి తన తల్లిని అరెస్టు చేయాల్సిందిగా కోరారు. తన ఐస్ క్రీమ్‌ను తల్లి దొంగతనం చేసిందని వచ్చి వెంటనే అరెస్ట్ చేయాలని అధికారులను అభ్యర్థించాడు. 911 సిబ్బందికి, పిల్లోడికి మధ్య జరిగిన ఈ ఫన్నీ సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

కాగా, పిల్లోడు తెలియక కాల్ చేశాడా? లేదా నిజంగానే ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నాడా? అని తెలుసుకునేందుకు మరుసటి రోజు పోలీసులు అతడి ఇంటికి వెళ్లాడు. అప్పుడు కూడా తన తల్లి తన ఐస్ క్రీమ్ తినేసిందని అరెస్టు చేయాలని కోరారు. ఆ తర్వాత కాసేపటికి తన తల్లిని అరెస్టు చేయొద్దని తనకు కేవలం ఐస్ క్రీమ్ కావాలని చెప్పటంతో పోలీసులు అతడికి ఐస్ క్రీమ్‌ను అందజేశారు. అనంతరం చిన్నపిల్లోడు తెలియక చేసినా తప్పును ఎత్తిచూపిన తన ధైర్యానికి మెచ్చుకుని అతడితో ఫోటో దిగారు.

Next Story