- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
King Cobra: భూమిపై 12 అతిపెద్ద విషపూరిత సర్పాలు ఇవే.. వేలాదిగా పాము కాటు మరణాలు

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రపంచంలో మనిషితో పాటు అత్యంత ప్రమాదకరమైన జీవులు ఉన్నాయని నిపుణులు చెబుతుంటారు. మనుషుల ప్రాణాలను అతి సులువుగా తీయగలిగే కొన్ని ప్రాణులు.. ప్రతి ఏడాది మిలియన్ల మరణాలకు కారణం అవుతాయంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ప్రపంచలోనే 12 అతి పెద్ద విషపూరిత పాముల (venomous snakes) గురించి తెలుసుకుందాం. ఈ భూమిపై దాదాపు 3,500 రకాల పాములు ఉన్నాయని, వాటిలో 600 జాతులు విషపూరితమని గతంలో పలు నివేదికలు తెలిపాయి. అతిపెద్ద విషసర్పం అయిన కింగ్ కోబ్రా దాదాపు 18 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. విషపూరితమైన బ్లాక్ మాంబా కాటు వేసినప్పుడు విరుగుడు లభించకపోతే 6 గంటల్లోనే ప్రాణం పోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక భారత్‌లో ఎక్కువగా కనిపించే రస్సెల్స్ వైపర్ భారత్‌లో అతి పెద్ద నాలుగు పాముల్లో ఒకటి. దీని వల్ల ప్రతి ఏడాది వేలాది మంది మరణాలకు కారణమవుతోంది.
అతిపెద్ద విషపూరిత పాములు
1. కింగ్ కోబ్రా 18 ఫీట్ల వరకు భారత్, ఆగ్నేయ ఆసియా, సౌత్ చైనా
2. బ్లాక్ మాంబా 6.6-14.8 ఫీట్స్ సబ్-సహారా ఆఫ్రికా
3. బుష్ మాస్టర్ 6.6-13 ఫీట్స్ సెంట్రల్ సౌత్ అమెరికా, ట్రినిడాడ్
4. కింగ్ బ్రౌన్ స్నేక్ 6.6-8.2 ఫీట్స్ ఆస్ట్రేలియా
5. ఇన్‌ల్యాండ్ తైపాన్ 5.9-8.2 ఫీట్స్ ఆస్ట్రేలియా
6. ఫారెస్ట్ కోబ్రా 4.6-7.2 ఫీట్స్ ఆఫ్రికా
7. రాటిల్‌స్నేక్ 4-6 ఫీట్స్ ఉత్తర అమెరికా
8. ఈస్ట్రాన్ బ్రౌన్ స్నేక్ 4.9-7 ఫీట్స్ ఆస్ట్రేలియా
9. బ్యాండెడ్ క్రైట్ 3.2-6.6 ఫీట్స్ ఆగ్నేయ ఆసియా, సౌత్ చైనా
10. ఫెర్-డి-లాన్స్ 8 ఫీట్స్ పైగా వెనిజులా, ఆగ్నేయ కొలంబియా, ఈక్వెడార్, పెరూ, బొలీవియా, నార్త్ బ్రెజిల్, సెంట్రల్ అమెరికా, ఈస్ట్ మెక్సికో
11. గబూన్ వైపర్ 4-7 అడుగులు సెంట్రల్ ఆఫ్రికా
12. (ఎల్లో సీ స్నేక్) పసుపు సముద్ర పాము 3-5 అడుగులు నార్త్ హిందూ మహాసముద్రం, న్యూ కాలెడోనియా, ఆగ్నేయాసియా, ఉదాహరణకు ఫిలిప్పీన్స్, న్యూ గినియా