Deepika Padukone ను ఇమిటేట్ చేసిన Rashmika Mandanna.. ట్రెండింగ్‌లో రియాక్షన్

by Shyam |   ( Updated:2021-09-22 03:30:24.0  )
Deepika Padukone ను ఇమిటేట్ చేసిన Rashmika Mandanna.. ట్రెండింగ్‌లో రియాక్షన్
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ రష్మిక మందన టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అయిపోయింది. షారుఖ్ ఖాన్- దీపికా పదుకునేల ‘ఓం శాంతి ఓం’ మూవీలోని ‘ఏక్ చుట్కీ కి సింధూర్ కీ కీమత్ తుమ్ క్యా జానో రమేష్ బాబు’ డైలాగ్‌ను.. రష్మిక ఓ ఇంటర్వ్యూలో చెప్పగా అది కాస్త వైరల్ అయింది. ఈ క్లిపింగ్ వీడియోను దీపిక కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి అద్భుతంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చింది. దీంతో మురిసిపోయిన రష్మిక హ్యాపినెస్‌తో ఏకంగా డ్యాన్స్ చేసేసింది. తన స్కూలింగ్‌లో ఈ డైలాగ్ చాలా ఫేమస్ అని చెప్పిన రష్మికను క్యూటెస్ట్ అంటూ పొగిడేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఖుష్ అవుతున్న రష్మిక అండ్ దీపిక ఫ్యాన్స్.. ఈ డైలాగ్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. కాగా, దీపిక ‘ఓం శాంతి ఓం’ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ‘మిషన్ మజ్ను’ సినిమాతో బాలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్న లిల్లీ.. ‘గుడ్ బై’ మూవీలో అమితాబ్ బచ్చన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది.

Advertisement

Next Story