మినర్వా కాంప్లెక్స్‌లో ప్రకంపనలు.?

by Shyam |
మినర్వా కాంప్లెక్స్‌లో ప్రకంపనలు.?
X

సికింద్రాబాద్: ఎస్డీ రోడ్డులోని మినర్వా కాంప్లెక్స్‌‌ ఒక్కసారిగా ప్రకంపనలకు గురైందంటూ.. ప్రచారం సాగగా, కూలిపోతుందనే భయంతో అందులోని జనాలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. క్షణాల్లో ఐదంతుస్తుల భవనం ఖాళీ అయ్యింది.

భయబ్రాంతులకు గురై బయటకు వచ్చి రోడ్డుపై నిలబడి బిల్డింగ్ వైపు చూస్తూ ఉండిపోయారు. దీనిపై సమాచారమందుకున్న జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థతిని సమీక్షించారు. అయితే, గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న అలహాబాద్ బ్యాంక్ ఖాళీ చేస్తున్న క్రమంలో లాకర్లను తరలిస్తుండగా ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయని అధికారులు తేల్చారు. భవనం కూలడం లేదని తెలియడంతో సిబ్బంది, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఏదేమైనప్పటికీ, శిథిలావస్థకు చేరిన ఈ భవనంలో గతంలోనూ పెచ్చులూడి పడిన ఘటనలు చోటుచేసుకోవడంతో, అప్పట్నుంచీ ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు.

Advertisement

Next Story