Sruthy Sithara : ‘మిస్ ట్రాన్స్ గ్లోబల్’ పోటీలకు కేరళ మోడల్

by Shyam |   ( Updated:2021-06-04 04:36:14.0  )
Sruthy Sithara : ‘మిస్ ట్రాన్స్ గ్లోబల్’ పోటీలకు కేరళ మోడల్
X

దిశ, ఫీచర్స్ : కేరళ‌లోని వైకొమ్‌కు చెందిన శ్రుతి సితారా (Sruthy Sithara) ఇటీవల మిస్ ట్రాన్స్ గ్లోబల్ ఇండియా 2021 టైటిల్ గెలుచుకుంది (Ms Trans Global India). జూన్‌లో లండన్‌లో జరగనున్న మిస్ ట్రాన్స్ గ్లోబల్ 2021లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. కొన్నేళ్ల క్రితం ప్రవీణ్‌గా ఉన్న ఆమె, తన ఐడెంటిటిని గుర్తించి శ్రుతిగా మారడమే కాకుండా, ఎన్నో అద్భుతాలు చేస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం.. ప్రవీణ్‌గా ఉన్న శ్రుతి, తనలో దాగున్న మరో మనిషి గురించి సంఘర్షణకు లోనయింది. తనది మానసిక సమస్యగా భావించినా, మగ శరీరం లోపల చిక్కుకున్న శ్రుతి ఆరేళ్ల పాటు వేదన అనుభవించింది. కొట్టాయం‌లోని రెసిడెన్షియల్ స్కూల్లో పన్నెండో తరగతి వరకు చదువుకున్న శ్రుతికి, ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ గురించి అప్పటివరకు తెలియదు. కాలేజీలో ఓ సారి తనలాంటి వ్యక్తులను కలిసింది. కానీ ఆమె ఇంకా ప్రవీణ్‌గానే కొనసాగింది. నెమ్మదిగా, ఆమె ప్రవీణ్ నుంచి, సమాజ కట్టుబాట్ల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆమె భయాలకు విరుద్ధంగా, ప్రతి ఒక్కరూ ఆమెను గౌరవంగా చూడటంతో ఆమె ఆనందపడింది. ప్రవీణ్‌లోని దాగున్న శ్రుతి గురించి, తన మిత్రులు శ్రుతి నాన్నతో చెప్పడంతో, ఆయన కూడా త్వరగానే అర్థం చేసుకుని, అంగీకరించాడు. తన స్నేహితులు కూడా శ్రుతికి మద్ధతుగా నిలవడంతో ఆమె తన జీవితంలో కీలక అడుగులు వేసింది. ఇదంతా ఒక కాక్‌వాక్ అని ఆమె చెప్పదు. తిరస్కరణ, అనుమానం, అవమానం, వింతగా చూడటం, చివాట్లు ఇవన్నీ ఉంటాయి కానీ నెమ్మదిగా వాటిని అంగీకరించింది శ్రుతి. చుట్టూ ఉన్న ప్రతికూలతను విస్మరించి తన చిరకాల స్వప్నం మీదే దృష్టి కేంద్రికరించింది. ఐఏఎస్ కావాలన్నది తన కల మాత్రమే కాదు, ఆమె తల్లి కల కూడా. సివిల్ సర్వీస్ పరీక్ష రాసినా, ఆమె అనుకున్న ఫలితం సాధించలేదు. ఇక 2018‌లో ద్వయ క్వీన్‌గా నిలవడంతో, అప్పటి నుంచి ట్రాన్స్ బ్యూటీ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తోంది.

‘ప్రస్తుతం సామాజిక న్యాయ విభాగంలో పనిచేస్తున్నాను. నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోలేదు. నా కుటుంబం నా నిర్ణయాన్ని కూడా అర్థం చేసుకుంది. మిస్ ట్రాన్స్ గ్లోబల్ ఇండియా టైటిల్ గెలుచుకుంటానని నేను ఎప్పుడూ ఊహించలేదు. నమ్మలేకపోయాను, ఇది గర్వించదగిన నెల కావడంతో, ఇది నా సమాజానికి కూడా ఒక పుష్ అప్ లాంటిది. ఇది ఒక గొప్ప అవకాశం, ప్రపంచ వేదికపై మన దేశానికి, నా సంఘానికి ప్రాతినిధ్యం వహించగలిగినందుకు నేను గర్వపడుతున్నాను. మిస్ ట్రాన్స్ గ్లోబల్ పోటీల కోసం మానసికంగా సిద్ధమవుతున్నాను. – శ్రుతి సితారా, ట్రాన్స్‌జెండర్

Advertisement

Next Story

Most Viewed