ఏపీలో 16 మంది ఐఏఎస్‌ల బదిలీ

by srinivas |
ఏపీలో 16 మంది ఐఏఎస్‌ల బదిలీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 16 మంది ఐఏఎస్‌లను బదిలీ చేసింది. అంతే కాకుండా ఖాళీగా ఉన్న ప్రభుత్వ విభాగాల బాధ్యతలను కూడా కొందరు ఐఏఎస్‌లకు అదనంగా అప్పగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వెయిటింగ్‌లో ఉన్న కొందరు ఐఏఎస్‌లకు పోస్టింగులిచ్చింది.

వాటి వివరాల్లోకి వెళ్తే… బీసీ వెల్ఫేర్ స్పెషల్ సీఎస్‌గా కె. ప్రవీణ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించింది. క్రీడలు, యువజన సంక్షేమం ప్రిన్సిపల్ సెక్రటరీగా కె. రామ్‌గోపాల్‌ను నియమించింది. ఎస్టీ వెల్ఫేర్ సెక్రటరీగా కాంతిలాల్ దండేకు అప్పగించింది. ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా జి. శ్రీనివాసులును నియమించింది.

దేవాదాయశాఖ స్పెషల్ కమిషనర్‌గా పి. అర్జున్‌రావు, సీతంపేట ఐటీడీఏ ఈవోగా చామకూరి శ్రీధర్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా స్వప్నిల్ దినకర్, కాకినాడ మున్సిపల్ కమిషనర్‌గా సునీల్‌కుమార్‌రెడ్డి, ఫైబర్ నెట్ ఎండీగా ఎం. మధుసూదన్‌ రెడ్డి, ఏపీ ఎండీసీ ఎండీ(ఇంచార్జ్)గా వీజీ వెంకట్‌రెడ్డిని నియమించింది.

రజత్ భార్గవ్‌కు అదనంగా పర్యాటకం, సాంస్కృతిక శాఖలు కట్టబెట్టి, సర్వే, ల్యాండ్ సెటిల్‌మెంట్స్ డైరెక్టర్‌గా సిద్ధార్థజైన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. మత్స్యశాఖ కమిషనర్‌గా కన్నబాబుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అనంతపురం జేసీ(అభివృద్ధి)గా ఎ.సిరి, సివిల్‌ సప్లైస్ డైరెక్టర్‌గా దిల్లీరావు, శాప్ ఎండీగా వి.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించింది.

Advertisement

Next Story

Most Viewed